E-Paper
Advertisement

ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు సూట్‌కేస్ చక్రాలకు టేప్..ఈ వింత పని వెనక అసలు రహస్యం ఇదే!

ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు సూట్‌కేస్ చక్రాలకు టేప్..ఈ వింత పని వెనక అసలు రహస్యం ఇదే!
Advertisement

Travellers taping suitcase wheels: ప్రయాణాలు చేయడానికి ఇష్టపడేవారు ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రిక్ లేదా హ్యాక్ కోసం చూస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులు తమ సూట్‌కేస్ చక్రాలకు టేప్ చుట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. లగేజీని మురికి, ధుమ్ము నుంచి కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని కొందరు అంటుంటే.. మరికొందరు దీని వల్ల చక్రాల కదలిక దెబ్బతింటుందని అంటున్నారు. అసలు ఈ వైరల్ టెక్నిక్ వెనక ఉన్న నిజానిజాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్‌లు , రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించేటప్పుడు లగేజీని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ సవాలే. ముఖ్యంగా సూట్‌కేస్ చక్రాలు.. దుమ్ము, ధూళి, తేమ వంటి వాటికి నేరుగా గురికావడం వల్ల త్వరగా పాడైపోతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కొందరు ప్రయాణికులు వింతైన హ్యాక్‌ను ప్రయత్నిస్తున్నారు. అదే సూట్‌కేస్ చక్రాల చుట్టూ టేప్ చుట్టడం. మరి ఈ పద్ధతి నిజంగానే లగేజీకి రక్షణ కల్పిస్తుందా లేక ఇబ్బందులు సృష్టిస్తుందా ?

Advertisement

టేప్ చుట్టడం వల్ల ప్రయోజనం ఉందా?

ప్రముఖ ట్రావెల్ కన్సల్టెంట్ , సిక్కిం ఎక్స్‌పెడిషన్స్ సీఈవో డీకే ఘటాని తెలిపిన వివరాల ప్రకారం.. సూట్‌కేస్ చక్రాలపై టేప్ వేయడం తాత్కాలికంగా వాటిని కాపాడటానికి చేసే పని మాత్రమే. తడి, మురికి రోడ్లు లేదా ఎయిర్‌పోర్ట్ ఫ్లోర్‌లపై లగేజీని లాగాల్సి వచ్చినప్పుడు చక్రాలపై దుమ్ము, ధూళి పేరుకుపోకుండా.. ఇది కొంతవరకు నివారిస్తుంది. అలాగే స్టోరేజ్ సమయంలో చిన్నపాటి గీతలు పడకుండా పల్చని అడ్డుగోడలా పని చేస్తుంది. అయితే.. దీని వల్ల రక్షణ చాలా పరిమితంగానే ఉంటుంది. భారీ దెబ్బల నుంచి లేదా చక్రాల మెకానిజమ్‌లోకి నీరు చేరకుండా ఇది పూర్తిగా ఆపలేదు.

Advertisement

చక్రాలపై ప్రభావం ?

చక్రాలకు సరిగ్గా టేప్ చుట్టకపోతే వాటి పని తీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. టేప్ మందంగా ఉండి, చక్రాల పై నుంచి ఊడి వస్తే అప్పుడు అది నేలపై తగులుతుంది. దీనివల్ల సూట్‌కేస్ ఈజీగా తీసుకువెళ్లడం కుదరదు. బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. అంతేకాకుండా.. టేప్‌లోని అంటుకునే జిగురుకు దుమ్ము, ఇసుక కణాలు త్వరగా అతుక్కుంటాయి. దీని వల్ల చక్రాలు తిరగడం మరింత కష్టమవుతుంది. తేమ లేదా నునుపైన నేలపై నడిచేటప్పుడు కొన్ని రకాల టేప్‌లు పట్టును కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల మూవింగ్ జాయింట్లు లేదా యాక్సిల్స్‌పై గట్టిగా టేప్ చుట్టకుండా ఉండటం మంచిది.

చక్రాల రక్షణ:

టేప్ అనేది కేవలం తాత్కాలిక ఏర్పాటే తప్ప, సరైన నిర్వహణకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణానికి ముందు ,తర్వాత చక్రాలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. యాక్సిల్ చుట్టూ చుట్టుకున్న వెంట్రుకలు లేదా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఎలాంటి శబ్దం లేకుండా.. చక్రాలు సాఫీగా తిరుగుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. లగేజీని ఎక్కువ కాలం స్టోర్ చేసేటప్పుడు చక్రాల కదలికకు ఎలాంటి ఇబ్బంది కలిగించని ప్రత్యేకమైన వీల్ కవర్లను ఉపయోగించడం బెస్ట్.

టేప్ హ్యాక్ అనేది ఎమర్జెన్సీ సమయంలో లేదా అత్యంత మురికి ప్రదేశాలలో లగేజీని తీసుకెళ్లేటప్పుడు షార్ట్-టర్మ్ ట్రిక్‌గా పని చేస్తుంది. కానీ దీన్ని శాశ్వత పరిష్కారంగా భావించకుండా.. లగేజీ వీల్స్ మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవడం ద్వారా ప్రయాణాలను మరింత ఈజీ చేసుకోవచ్చు.

Tags

Related News

తాగేది మనుషులు కాదు.. దేవుడే! ఈ గుడిలో మద్యాన్ని ప్రసాదంగా ఎందుకు ఇస్తారో తెలుసా?

కొండచిలువ లాంటి స్వభావం.. ఈ తేదీల్లో పుట్టినవారు సరైన టైమింగ్‌తో విజయం సాధిస్తారు

బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు.. లేదంటే మీ మర్యాద కోల్పోతారు

క్యాన్సర్ నివారణకు కేవలం 3 నిమిషాలు చాలు.. రోజు ఇలా చేస్తే సమస్యకు చెక్

ఫుట్ ప్యాడ్స్‌తో బరువు తగ్గవచ్చా.. నిజమేనా?

వానలో బైక్ నడుపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

డయాబెటీస్ లేకపోయినా మీ షుగర్ పెరుగుతోందా? ఇది ఎలా సాధ్యం.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×