E-Paper
Advertisement

కృష్ణతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. అసలు కారణం చెప్పిన డైరెక్టర్!

కృష్ణతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. అసలు కారణం చెప్పిన డైరెక్టర్!
Advertisement

Siva Nageswara Rao:శివ నాగేశ్వరరావు..మనీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ డైరెక్టర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పలు విషయాలు ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఇండస్ట్రీలో తన జర్నీ గురించి,అలాగే పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలు ,అలాగే సూపర్ స్టార్ కృష్ణ తో చేయాల్సిన సినిమా ఎందుకు థియేటర్ ల వరకు రాలేదనే పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా ఒపెన్ గా చెప్పుకొచ్చారు.

Advertisement

సినిమా రిలీజ్‌కు ముందు ఇండస్ట్రీలో కొందరు సినిమా ఆడుతుందా లేదా అంటూ అంచనాలు వేస్తుంటారని,వారి మైండ్ సెట్ ఫిక్స్డ్ గా ఉంటుందని, కానీ ఆడియన్స్ ఆలోచన మాత్రం అందుకు బిన్నంగా ఉంటుందని తెలిపారు. సినిమా ఎలా ఉండాలి, జనానికి ఏం నచ్చుతుందో ముందే ఫిక్స్ అయిపోయి చాలామంది రకరకాల అభిప్రాయాలు చెబుతుంటారని తెలిపారు. దీనికి ఉదాహరణగా ఆయన ‘శంకరాభరణం’ సినిమాను చెబుతూ ఆ సినిమా రిలీజ్ కాకముందు ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేవని,కానీ థియేటర్ లలో ఆ సినిమాని చూశాక ఫిదా అయిపోయారని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ముందే సినిమా చూసి జడ్జ్ చేయడం కంటే, ప్రేక్షకులు థియేటర్లో ఇచ్చే రియాక్షనే అసలైనదని, ప్రివ్యూ షోలలో మొహమాటానికి బాగుందని చెప్పి బయటకు వెళ్లాక వేరేలా మాట్లాడేవాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉంటారని ఆయన అసలు నిజాన్ని బయటపెట్టారు.

Advertisement

ఇక తన కెరీర్‌లో వచ్చిన లాంగ్ గ్యాప్ గురించి మాట్లాడుతూ.. 2009 తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నానని, 2015 చివర్లో ‘ఓవర్ యాక్షన్’ అనే సినిమా చేశానని చెప్పారు. సినిమాలు చేయకపోయినా తాను ఎప్పుడూ ఖాళీగా కూర్చోనని, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటానని తెలిపారు. కొత్త కథలు రాసుకోవడం, సినిమాలు చూడటం, తనకు చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడం ఇలా తన రోజు గడిచిపోతుందని వివరించారు.

ఇక సినిమాలు తీయకపోవడానికి డబ్బులు లేకపోవడం ఒక్కటే కారణం కాదని క్లారిటీ ఇచ్చారు.అన్నింటికన్నా ముఖ్యంగా తనతో సినిమా చేయడానికి వచ్చే వాళ్లకి అసలు సినిమా చేస్తే ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తానని కుండ బద్దలు కొట్టేశారు.ముఖ్యంగా సినిమా తీస్తే పది రేట్ల డబ్బులు వస్తాయని ఆశలు కల్పించడం తనకి అలవాటు లేదని, ఫ్రైడే మార్నింగ్ షో పడగానే సినిమా జాతకం తెలిసిపోతుందని, ఒకవేళ తేడా కొడితే పరిస్థితి ఏంటో ముందే ఆలోచించుకోమని నిర్మాతలకు సలహా ఇస్తానన్నారు.

ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికితనలో టాలెంట్ లేకపోవడం కారణం కాదని, తానే ఏ హీరో దగ్గరికి వెళ్లి ఛాన్స్ అడగలేదని చెప్పారు. ‘మనీ’, ‘వన్ బై టూ’, ‘లక్కీ ఛాన్స్’ లాంటి సినిమాలు చేసేటప్పుడు పెద్ద హీరోలతోనే చేయాలన్న ఆలోచన తనకు లేదని, మంచి కథ దొరికితే చాలు సినిమా చేసేవాడినని తెలిపారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణ గారితో మాత్రం ఒక సినిమా చేశానని, కానీ అది జనం ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు మారుతున్న సమయం అని,ఆ సమయంలో మద్రాస్, హైదరాబాద్ ఫైటర్స్ మధ్య పెద్ద గొడవలు జరిగాయని, దాంతో అది కాస్తా తన సినిమాపై చాలా ఎఫెక్ట్ చూపించిందని వివరించారు.ఒకవేళ కృష్ణ గారి సినిమా కనుక రిలీజ్ అయి ఉంటే తనకు మరికొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వచ్చేదని తన మనసులోని మాటల్ని బయటపెట్టారు ఈ వెటరన్ డైరెక్టర్ !

ALSO READ:వైష్ణవి సోనీ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. మల్లె చెట్టు రచ్చ మామూలుగా లేదుగా!

Tags

Related News

సమంతకు పుట్టేది కొడుకే 12 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్ !

“దివికి దివికి”.. వదినా మరదళ్లుగా దుమ్ములేపేసిన కీర్తి – కృతి!

అద్దెల రూపంలో అమీర్ ఖాన్ కి నెలకు ఎంత ఆదాయం వస్తోందంటే?

కావ్య-అనిరుధ్ పెళ్లి.. ఉద్యోగులకు స్పెషల్ సర్ప్రైజ్?వీడియో వైరల్!

ఒకే మూవీకి రెండు సీక్వెల్స్.. ఆసక్తి రేపుతున్న హను-మాన్ కొత్త పోస్టర్!

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ప్రకటన.. విన్నర్స్ ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి పైరసీ కలకలం.. ఆ సినిమాలకు బిగ్ షాక్..

Big Stories

Advertisement
×