71st National Film Awards 2025 Announced: సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. 2025 జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితాను తాజాగా జ్యూరీ సభ్యులు కేంద్ర మంత్రలు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్‌కు అందజేశారు. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి జాబితాను విడుదల చేశారు. ఇందులో ఉత్తమ జాతీయ తెలుగు విభాగంగాలో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ ఎంపికవ్వడం విశేషం. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ప్లవరిగ్ మ్యాన్(హిందీ) ఎంపికైంది.
ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ నేషనల్ అవార్డుకు ఎంపికైంది. అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీగా హనుమాన్ (తెలుగు) సినిమాలు జాతీయ అవార్డుకు ఎంపికవ్వడం విశేషం.
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ జాతీయ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ హీరో: షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)
ఉత్తమ యాక్టర్ లీడింగ్ రోల్: రాణి ముఖర్జీ
ఉత్తమ స్క్రీన్ ప్లే: బేబీ సాయి రాజేష్ నీలం
ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్: (బేబీ) రోహిత్
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: సుకుమార్ కుమార్తె (గాంధీ తాత చెట్టు)
ఉత్తమ లిరిక్స్: బలగం (ఊరు పల్లెటూరు పాట )
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్(వాతి)
2025 జాతీయ చలనచిత్ర పురస్కాలు.. నాన్-ఫీచర్ విభాగంలో
నాన్ ఫిచర్ ఫిల్మ్ కేటగిరి
స్పెషల్ మెన్షన్ చిత్రాలు