Balakrishna Movie: నందమూరి నట సింహం బాలకృష్ణకు(Balakrishna) 71 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో(71 National Awards) భాగంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు గాను అవార్డు లభించింది. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023 దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela), సీనియర్ నటి కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా తండ్రీ కూతురి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాకు తాజాగా నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందంతో పాటు బాలయ్య అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య కూతురుగా శ్రీ లీల..
బాలకృష్ణ ఇటీవల కాలంలో తన వయసుకు అనుగుణంగా ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా యాక్షన్ మూవీ అయినప్పటికీ ఇందులో తండ్రి కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా ద్వారా సమాజంలో అమ్మాయిలు ఎలా ఉండాలి.. గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ వంటి అంశాల గురించి కూడా ఎంతో చక్కగా తెలియజేశారు.
ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి..
ఈ సినిమా 2023 దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా బాలకృష్ణ పాత్ర పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అనిల్ రావిపూడి బాలకృష్ణ కలయికలో వచ్చిన మొట్టమొదటి సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, శ్రీ లీలా బాలయ్య కూతురి పాత్రలో నటించి మెప్పించారు. ఇలా ఈ సినిమా నేడు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ 2 పనులలో బాలయ్య…
ఇక బాలయ్య సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2(Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల గురించి చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు.