Rajinikanth: రజనీకాంత్ (Rajinikanth) కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. సాధారణ బస్ కండక్టర్ జీవితం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినీ ఇండస్ట్రీలో తన 50 సంవత్సరాల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా రజనీకాంత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) దర్శకత్వంలో నటించిన కూలీ సినిమా(Coolie Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.
రజనీకాంత్ 4 సినిమాలు…
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఎక్కడో ప్రేక్షకులలో చిన్న నిరాశ ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అలాగే తెలుగులో కూడా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఆరో సినిమాగా కూలీ రికార్డులను సాధించింది. అయితే ఈ ఆరు సినిమాలలో నాలుగు సినిమాలు రజనీకాంత్ సినిమాలు ఉండటం విశేషం. ఇలా తెలుగులో మాత్రమే కాదు హిందీ మార్కెట్లో (Hindi Market)కూడా రజనీకాంత్ తన సత్తా చాటుకున్నారు.
హిందీలో సత్తా చాటిన కూలీ…
కూలీ సినిమా ఓటీటీ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే హిందీలో పరిమితమైనది. ఇలా సింగిల్ స్క్రీన్ కి పరిమితమైనప్పటికీ హిందీలో మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలయ్యి హిందీలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమా మొదటి స్థానంలో నిలిచింది .ఈ సినిమా 30 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కలెక్షన్లను బీట్ చేస్తూ కూలీ బాలీవుడ్ ఇండస్ట్రీలో 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
500 కోట్ల క్లబ్ లో కూలీ?
ఆగస్టు 14వ తేదీ రజనీకాంత్ కూలీ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2(War 2) సినిమా విడుదలైంది అయితే ఈ సినిమాకు పోటీగా కూలీ అక్కడ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం విశేషం. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి నటించిన లియో సినిమా కూడా హిందీలో 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టటం విశేషం. దాదాపు రెండు వారాలను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 475 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే 500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. టాలీవుడ్ నటుడు నాగార్జున సైమన్ అనే విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. నాగార్జునతో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ వంటి తదితరులు ఈ సినిమాలో భాగమయ్యారు.
Also Read: Anupama Parameswaran: కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్నా కనపడవు.. అనుపమ ఎమోషనల్ !