E-Paper
Advertisement

AAFA: ఏడాదికి ఒక మంచి పని.. రాయలసీమ జిల్లాల్లో అల్లు అర్జున్ సామ్రాజ్యం ఏర్పాటు!

AAFA: ఏడాదికి ఒక మంచి పని.. రాయలసీమ జిల్లాల్లో అల్లు అర్జున్ సామ్రాజ్యం ఏర్పాటు!
Advertisement

AAFA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) పిలుపునిచ్చిన ‘ఏడాదికి ఒక మంచి పని’ (One Good Deed Every Year) అనే స్ఫూర్తితో, రాయలసీమ (Rayalaseema) వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. తాజాగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అధికారికంగా నూతన కమిటీలను ప్రకటించారు. కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, క్రమశిక్షణతో కూడిన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే లక్ష్యంగా ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అసోసియేషన్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియ జరిగింది.

Also Read- Actress Udaya Bhanu: సుమాపై అనుచిత వ్యాఖ్యలు.. అసలు విషయం బయటపెట్టిన ఉదయభాను!

ఏడాదికి ఒక మంచి పని

Advertisement

బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని పెంపొందించే దిశగా ప్రతి జిల్లాకు అంకితభావం కలిగిన అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను ఈ ప్రక్రియలో ఎంపిక చేశారు. అభిమానం అంటే కేవలం థియేటర్ల వద్ద హడావిడి చేయడం మాత్రమే కాదని, సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని భావిస్తూ.. ప్రతి జిల్లా కమిటీ ఏడాదికి కనీసం ఒక భారీ సామాజిక కార్యక్రమం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నూతన కమిటీల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రక్తదాన శిబిరాలు, నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడం, సామాజిక అవగాహన సదస్సులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా అసోషియేషన్ మెంబర్స్ చెబుతున్నారు. బాధ్యతాయుతమైన అభిమాన సంస్కృతిని నిర్మిస్తూ, అల్లు అర్జున్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న ఈ నూతన సభ్యులకు అసోసియేషన్ అభినందనలు తెలిపింది. రాయలసీమలో ఈ విస్తరణ ద్వారా AAFA తన సేవా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుందని తెలుస్తోంది.

Also Read- Vijay Rashmika wedding: ముగిసిన విజయ్ రష్మిక పెళ్లి.. మీడియాకు స్పెషల్ గిఫ్ట్స్!

మెగాస్టార్ చిరంజీవినే ఫాలో అవుతున్నాడా!

Advertisement

ఇక అల్లు అర్జున్ ఈ మూవ్ చూసిన వారంతా.. సేమ్ టు సేమ్ మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఫాలో అవుతున్నారనేలా కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమానులకు దిశా నిర్దేశం చేస్తూ, రక్తదానం, నేత్రదానం వైపు నడిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నందు ఎంతోమంది అభిమానులు రక్తదానం చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటూ.. అభిమానుల్లో మెగాభిమానులు వేరని నిరూపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ కూడా ఇదే మార్గంలో తన అభిమానులను నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉండనుంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే.

Also Read- Naveen Polishetty: బాడీ అలా లేదని.. చిప్స్ అడ్వర్టైజ్మెంట్ కి కూడా తీసుకోలేదు.. తెలుగు స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు..

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×