E-Paper
Advertisement

AAFA Meeting: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం.. నెక్స్ట్ ఏంటంటే?

AAFA Meeting: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం.. నెక్స్ట్ ఏంటంటే?
Advertisement

AAFA Meeting: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దాదాపు 4 నుంచి 5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ గారు అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రారంభించారు.

Read also-Whats Up Naresh Glimpse: ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ చూశారా… కోట్లు కావాలంట కట్నం!

Advertisement

హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో, ఎంపికైన ప్రతినిధులకు వారి *పాత్రలు మరియు బాధ్యతలు (Roles & Responsibilities)ను స్పష్టంగా వివరించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు.

Read also-Rakshit Shetty: రష్మిక మాజీ ప్రియుడి గురించి కీలక విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అర్థరాత్రి 2 గంటలకు గొడవ అంటూ..!

Advertisement

అలాగే, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో వెల్లడించారు. అల్లు అర్జున్ గారి ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు.. ప్రస్తుతం అట్లీ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×