E-Paper
Advertisement

Municipal Elections: తెలంగాణలో జనసేన పార్టీ తరుపున ఓ యువ హీరో ప్రచారం.. ఎవరో తెలుసా..?

Municipal Elections: తెలంగాణలో జనసేన పార్టీ తరుపున ఓ యువ హీరో ప్రచారం.. ఎవరో తెలుసా..?
Advertisement

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ స్థానంలో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, యువ హీరో తనీష్ అల్లాడి ఆదివారం జిల్లాలో పర్యటించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు కావడంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో యువ హీరో తనీష్ అల్లాడి ఏదులాపురం తదితర మున్సిపాలిటీల పరిధిలో జనసేన జెండాలతో ప్రచారం చేయడం కనపడింది. జనసేన పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రచార పర్వంలో పాల్గొనేందుకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, యువ హీరో తనీష్ అల్లాడికి, జనసైనికులు అభిమానులు స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. జనసేన పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అవినీతి రహిత పాలనకు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, అభ్యర్థులు, వీరమహిళలు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

ఉమ్మడిఖమ్మంజిల్లాలో 39 చోట్ల జనసేన పోటీ

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీలో 39 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరి లో ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 22 కౌన్సిలర్ అభ్యర్థులు, ఖమ్మం జిల్లాలో 17మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా ఉన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ తో పాటు కల్లూరు, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, యువ హీరో తనీష్ అల్లాడి ఎన్ని కల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం మున్సిపల్ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో జనసైనికులు(అభ్యర్థులు) 4వ అభ్యర్థి కొమ్ము లక్ష్మి, 7వ వార్డ్ జార్పుల నీలిమ, 27 వ వార్డ్ బాణోత్ రఘు, 28వ వార్డ్ దండి సుధాకర్, 29వ వార్డ్ హనుమంతు మౌనికలు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గ నాయకులు బండారు రామకృష్ణ నేతృత్వంలో వీరికి బిఫాంలు అందించారు. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ 29వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి హనుమంతు మౌనిక ఎన్నికల ఇంటింటి ప్రచారంలో యసంనేని అజయ్, రాజు, బనోత్ దేవేందర్, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Kushi Kapoor: బికినీ అందాలతో హీట్ పుట్టిస్తున్న ఖుషీ కపూర్!

తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నట్లు స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆయన స్థానంలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి స్టార్ క్యాంపెయినర్, యువ హీరో తనీష్ అల్లాడి పర్యటన ఇక్కడ ఆసక్తిగా మారింది.

Advertisement

Also Read: Rakshit Shetty: రష్మిక మాజీ ప్రియుడి గురించి కీలక విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అర్థరాత్రి 2 గంటలకు గొడవ అంటూ..!

Related News

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

Big Stories

Advertisement
×