Aafiya Sayed: నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం అలియాస్ రుక్మిణి. బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా బృందం ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. అందులో భాగంగానే హీరోయిన్ ఆఫియా సయ్యద్ బిగ్ టీవీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై అలాగే సెట్ లో నాని , నితిన్ ప్రవర్తన పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నితిన్‌ని అందరూ ‘కమ్‌బ్యాక్’ హీరో అంటున్నారు కానీ, తనకు అసలు కమ్‌బ్యాక్ అవసరమే లేదని ఆఫియా అంది. ఇరవై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, కొత్త కుర్రాడిలా ఎనర్జీతో, ప్యాషన్‌తో పనిచేస్తారని చెప్పింది. ఎర్రటి టీ-షర్ట్, కళ్లద్దాలతో నితిన్ ఏడ్చే సీన్‌ని తను యాభై సార్లు చూసిందట, అంత బాగా చేశారని మెచ్చుకుంది.
ఇక నాని గురించి చెప్తూ, ఆయన ఎప్పుడూ తిట్టడం, విమర్శించడం లాంటివి చేయలేదని, ప్రతి సీన్‌కీ సపోర్ట్ ఇచ్చారని చెప్పింది. కెమెరామెన్ జో తీసిన ఫ్రేమ్‌లు చూసి ఆశ్చర్యపోయిందట. అలాగే మురి మైక్‌లో గట్టిగా అరుస్తూ, తన చెవి పక్కనే అరిచినప్పుడు “నా చెవి దగ్గర అరవకండి” అని సరదాగా ఆటపట్టించేదట. ఆయన వల్ల తనకు ఇల్లు గుర్తుకే రాలేదట, ఏం కావాలన్నా వెంటనే హెల్ప్ చేసేవారని చెప్పింది..
తను మామూలుగానే చాలా ఎమోషనల్ అని, గ్లిజరిన్ పెద్దగా వాడకుండానే చాలా సీన్లలో నేచురల్‌గా ఏడ్చేసిందని చెప్పింది. అతుల్ మోంగా, దర్శకుడు అపూర్ సింగ్ ఖార్కీ చెప్పిన మాటలు తనకు బాగా పనికొచ్చాయట. చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ డ్యాన్సులంటే ఇష్టమని, సొంతంగా ఏదైనా మంచి పని చేసిన తర్వాతే షారుఖ్‌ని కలవాలనుకుంటున్నానని చెప్పింది. కాలేజీ రోజుల్లో ముఖేష్ చాబ్రా దగ్గర కాస్టింగ్ అసిస్టెంట్‌గా, ఏడీగా, థియేటర్‌లో కూడా చేసిందని చెప్పుకొచ్చింది. లిబరల్ ఆర్ట్స్ చదివింది, కథక్ నేర్చుకుంది. నాన్న పైలట్ అయినా చాలా కూల్‌గా సపోర్ట్ ఇచ్చారట, అమ్మ వైపు బంధువుల్లో సినిమా వాళ్లు వున్నారని తెలిపింది.
also read:‘అలియాస్ రుక్మిణి’ నా వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయ్యింది: ఆఫియా సయ్యద్
అల్లు అర్జున్, నాని ఎనర్జీ వేరుగా ఉన్నా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సహా అందరికీ ఒక్కో స్టైల్ ఉంటుందని చెప్పింది. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమట, కానీ షూటింగ్ హడావిడిలో ఇక్కడి ఫుడ్ అంతగా తినలేకపోయానని అంది. ఇక మలయాళ సినిమాలు చేయాలని ఉందట, కామెడీ వేషాలు కూడా ట్రై చేయాలనుకుంటోంది. ఇప్పుడైతే గ్లామర్, ఎక్స్‌పోజింగ్ సీన్లు చేయడానికి తనకు అంత కంఫర్ట్‌గా లేదని, కొంచెం సిగ్గుగా ఉంటుందని చెప్పింది. తెలుగు, తమిళంలో ఆఫర్లు వచ్చినా, నాలుగో సినిమా రిలీజ్ అయ్యాకే నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.