Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ముద్దుల కుమార్తె క్లిన్ కారా(Klin Kaara) ఇటీవల స్కూల్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమెను హైదరాబాద్ లోని ప్రముఖ స్కూల్లో జాయిన్ చేసినట్టు ఇదివరకు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అలాగే వీడియోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిన్నారి ఏ స్కూల్లో చదువుతున్నారు అనే విషయాలను ఉపాసన(Upasana) రాంచరణ్(Ram Charan) ఎక్కడ వెల్లడించలేదు. తాజాగా ఉపాసన చేసిన ఒక పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా క్లిన్ కారా చదువుతున్నది సమంత (Samantha) స్కూల్లోనే అనే విషయం బయటపడింది.
గత వారంలో ఉపాసన తమ కుమార్తెను స్కూల్లో జాయిన్ చేశారు. తాజాగా నేడు ఉపాసన తన కూతురు స్కూల్లో జరుగుతున్న స్పోర్ట్స్ డే (SportsDay) సందర్భంగా పాఠశాలకు వెళ్లినట్టు ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. ఉపాసన క్లిన్ కారా స్కూల్లో స్పోర్ట్స్ కి సంబంధించిన ఫోటో ని షేర్ చేస్తూ అవర్ పస్ట్ స్పోర్ట్స్ డే అంటూ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసారు అదే విధంగా రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు సమంత ప్రాణ స్నేహితురాలు ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి తో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు.
ఇలా రాంచరణ్ ఉపాసన శిల్పారెడ్డితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడంతో క్లిన్ కారా చదువుతున్నది సమంత స్కూల్లోనే అనే విషయం బయటపడింది. సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఏకం ఎర్లీ లెర్నింగ్ సెంటర్ (Ekam Early Learning Centre) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.2020 ఫిబ్రవరిలో విద్యావేత్త ముక్తా ఖురానా, డిజైనర్ శిల్పా రెడ్డిలతో కలిసి ఆమె దీనిని ప్రారంభించారు. ఇక తాజాగా ఈ స్కూల్లోనే రామ్ చరణ్ కుమార్తె కూడా చదువుతున్నారని స్పష్టమైనది. ఈ విషయం తెలిసిన ఫాన్స్ సమంత స్కూల్ కూడా రన్ చేస్తున్నారా ఇన్నాళ్లు తెలియనే లేదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ స్కూల్లో 9 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఇక్కడ పేరెంట్-టాడ్లర్ ప్రోగ్రామ్ , ప్లేగ్రూప్, నర్సరీ, ప్రీ-ప్రైమరీ కోర్సులు డే-కేర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. జూబ్లీహిల్స్ తో పాటు పలు బ్రాంచ్లు హైదరాబాద్ లో ఉన్నాయి. స్పోర్ట్స్ డే కావడంతో ఉపాసన చేసిన ఈ పోస్ట్ ఆధారంగా తన కుమార్తె చదువుతున్నది సమంత స్కూల్లోనే అనే విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత ఇప్పటికే పలు బిజినెస్లను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్లోతింగ్ బిజినెస్ తో పాటు పెర్ఫ్యూమ్ బిజినెస్ అలాగే ప్రొడక్షన్స్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Also Read: బిగ్ బాస్ 10 విన్నర్ త్రిగుణ్…ఫుల్ సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ హీరో?