E-Paper
Advertisement

తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!

తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!
Advertisement

Saanve Megghana:సాన్వే మేఘన..తెలుగు తమిళం అన్న తేడా లేకుండా ఇప్పుడిప్పుడే కెరీర్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తొలిసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో పాల్గొంది.ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులని ఫిదా చేసింది. ఇక ఇదే మొదటిసారి అంటూ.. “First time to IFFI. Purely surrounded by Cine Enthusiasts, love and passion for films. Wonderful feeling to be here” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్

Advertisement

ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ స్టైలిష్ అవుట్‌ఫిట్, బ్లూ డెనిమ్ జీన్స్, సన్ గ్లాసెస్‌తో సాన్వే మేఘన అదరగొట్టిందనే చెప్పాలి.పైగా ఎలాంటి హడావుడి లేకుండా న్యాచురల్ స్మైల్ తో కనిపిస్తూ సందడి చేయడంతో సాన్వే ఈజ్ వన్ అండ్ ఓన్లీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.

ఇక సాన్వే మేఘన గురించి చెప్పాలంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆంథాలజీ’పిట్ట కథలు’లోని ‘రాముల’ ఎపిసోడ్‌తో ఆకట్టుకుంది ఈ అమ్మడు .ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా మెప్పించింది.అయితే ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘పుష్పక విమానం’లో రేఖ పాత్ర సాన్వే మేఘనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Advertisement

తన సినీ కెరీర్ లో ఒక స్పెషల్ మూమెంట్

ఇక ‘ప్రేమ విమానం’ సినిమాలో అభిత పాత్రలో కనిపించి మరోసారి ఆకట్టుకున్న ఈ భామ తమిళంలో ‘కుడుంబస్థాన్’ సినిమాతో అక్కడి ఆడియన్స్ ని కూడా అలరించింది.అలాగే తెలుగు సినిమా ‘టుక్ టుక్’లో లో సందడి చేసిన సాన్వే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటిగా తన సత్తా చూపే పనిలో పడింది.మొత్తానికి IFFIలోతొలిసారి పాల్గొనడం తన సినీ కెరీర్ లో ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పవచ్చు.

86 దేశాలకు చెందిన 150కి పైగా ఇంటర్ నేషనల్ ఫిలిమ్స్

IFFI విషయానికి వస్తే నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగిన ఈ 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సినీ తారల సందడితో సక్సెస్ అయిందనే చెప్పాలి. ‘స్టోరీస్ వితౌట్ బోర్డర్స్’ అనే థీమ్‌తో జరిగిన ఈ ఈవెంట్ లో 86 దేశాలకు చెందిన 150కి పైగా ఇంటర్ నేషనల్ ఫిలిమ్స్ ని స్క్రీన్ చేయడం విశేషం.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాన్వే మేఘన తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు పర్సనల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది.ఇక తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)ఫోటోలు కూడా అందులో భాగమే, చూడాలి మరి వచ్చే రోజులలో ఈ భామ మరిన్ని ఈవెంట్స్ తో సందడి చేస్తుందో !

ALSO READ:అసలు ఈ పాటలో ఏముందిరా మావా.. ఇంతలా వైరల్ అవుతోంది!

Tags

Related News

మహిళలంటే రోబోలు కాదు.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. పెద్ద స్కెచ్ వేశారుగా?

అలియాస్ రుక్మిణీ అంటే ఏంటో చెప్పిన హీరోయిన్!

నానికి గొడుగు పట్టిన నితిన్.. అసలు కారణం తెలిస్తే మతి పోవాల్సిందే!

అక్కినేని హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి!

సినిమా హిట్ అవ్వకపోతే సుమ యాంకరింగ్.. నేను సినిమాలు మానేస్తా: నాని

సుకుమార్ పై పందెం గెలిచిన అల్లు అరవింద్!

Big Stories

Advertisement
×