E-Paper
Advertisement

నానికి గొడుగు పట్టిన నితిన్.. అసలు కారణం తెలిస్తే మతి పోవాల్సిందే!

నానికి గొడుగు పట్టిన నితిన్.. అసలు కారణం తెలిస్తే మతి పోవాల్సిందే!
Advertisement

Nani -Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అలియాస్ రుక్మిణి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నాని(Nani) పాల్గొన్నారు. నాని సమర్పణలో అలియాస్ రుక్మిణి (alias rukmini)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

నానికి గొడుగు పట్టిన నితిన్..

ఈ సినిమా వేడుకలో భాగంగా నాని వేదిక పైకి వెళ్తున్న సమయంలో వెనక నితిన్(Nithin) గొడుగు పట్టుకొని వెళ్లడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా నాని క్లాప్ బోర్డు పట్టుకోగా నితిన్ నాని కోసం గొడుగు (umbrella)పట్టుకోవడంతో నాని యాటిట్యూడ్ చూపిస్తున్నారా అంటూ ఎంతోమంది ఈ వీడియో పై విమర్శలు కురిపించారు. అయితే నితిన్ ఇలా గొడుగు పట్టుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని నాని స్వయంగా వెల్లడించారు. నాని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నితిన్ టాప్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఆ సమయంలో నాని అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగే వారు.

మందలించిన ప్రొడక్షన్ మేనేజర్..

Advertisement

ఇలా నితిన్ హీరోగా నటించిన అల్లరి బుల్లోడు సినిమాకు నాని క్లాప్ అసిస్టెంట్ గా పని చేసినట్లు తెలిపారు అయితే మా ఇద్దరిదీ ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో నేను నితిన్ ని బాబు గారు అని పిలవకుండా నితిన్ అని పిలిచేవాడిని. తాను అలా పిలవడంతో ప్రొడక్షన్ మేనేజర్ కు నచ్చలేదు అందుకే నాకు బాగా క్లాస్ పీకారు దీంతో తాను నితిన్ ని పిలవడానికి వెళ్లి బాబు షాట్ రెడీ అనగా నితిన్ షాక్ అయినట్టు నాని తెలిపారు. అదేంటి పిలుపు తేడా ఉంది అని నితిన్ అడిగినప్పటికీ ఇలాగే పిలుస్తానని చెప్పాను. కానీ నితిన్ మాత్రం ఏం జరిగిందో చెప్పే వరకు లోకేషన్ కి రానని పట్టుపడ్డారు.

ఫ్రెండ్షిప్ పై ప్రశంసలు..

ఇలా నితిన్ అనేసరికి తాను జరిగిన విషయం మొత్తం చెప్పడంతో నితిన్ ఇప్పుడు ఆ మేనేజర్ కి మండాలంటే ఏం చేయాలి అని అడిగారు. మీరు నా భుజం మీద చేయి వేసుకొని రండి అని నాని చెప్పారు. అది కాదు ఇంకా మండాలంటే ఏం చేయాలి అని నితిన్ అడగగా మీరు నాకు గొడుగు పట్టుకొని రండి అని చెప్పడంతో 20 సంవత్సరాల క్రితం నాని చేతిలో క్లాప్ బోర్డు ఉండగా నితిన్ నానికి గొడుగు పట్టుకుని సెట్లోకి వచ్చారు. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ నేడు ఈ సినిమా ఈవెంట్లో మరోసారి నితిన్ నానికి గొడుగు పట్టారు. అయితే ఈ విషయం తెలియక చాలామంది నాని సక్సెస్ రాగానే యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటూ విమర్శలు కురిపించారు కానీ అసలు విషయం తెలిసి వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Also Read: సినిమా హిట్ అవ్వకపోతే సుమ యాంకరింగ్.. నేను సినిమాలు మానేస్తా: నాని

Related News

అక్కినేని హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి!

సినిమా హిట్ అవ్వకపోతే సుమ యాంకరింగ్.. నేను సినిమాలు మానేస్తా: నాని

సుకుమార్ పై పందెం గెలిచిన అల్లు అరవింద్!

యూట్యూబ్‌లో టాప్ 10 ట్రెండింగ్ సౌత్ మాస్ మూవీస్ ఇవే!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘వీడొక్కడే’ మూవీ నటుడు!

ఆటో జానీగా ‘కాకా’.. అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..

Big Stories

Advertisement
×