E-Paper
Advertisement

అలియాస్ రుక్మిణీ అంటే ఏంటో చెప్పిన హీరోయిన్!

అలియాస్ రుక్మిణీ అంటే ఏంటో చెప్పిన హీరోయిన్!
Advertisement

Aafiya Sayed:మురళీకాంత్ దేవసోత్ రచన, దర్శకత్వంలో నాని సమర్పిస్తున్న చిత్రం అలియాస్ రుక్మిణి. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ (Nithin ) హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్ (Aafiya Sayed) హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే నిన్నటికి నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించారు. అందులో సినిమాపై నాని పెట్టుకున్న అంచనాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవ్వకపోతే సినిమాలకు తాను , యాంకరింగ్ కి సుమా దూరమవుతాం అంటూ చేసిన కామెంట్లు కూడా అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

అలియాస్ రుక్మిణి అంటే?

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా హీరోయిన్ ఆఫియా సయ్యద్ బిగ్ టీవీకి ప్రత్యేకంగా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన అలాగే తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది. అందులో భాగంగానే అలియాస్ రుక్మిణి అంటే ఏంటో చెప్పి సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ ప్రశ్నిస్తూ ..”అలియాస్ రుక్మిణి అంటే పెన్ పేరు లేక పుస్తకం పేరు ?” అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ “అలియాస్ రుక్మిణి అనేది పెన్ పేరు. పుస్తకం పేరు కాదు” అంటూ అలియాస్ రుక్మిణి అంటే ఏంటో క్లారిటీ ఇచ్చారు ఆఫియా సయ్యద్.

తన పాత్ర ఇదే..

Advertisement

ఇందులో రుక్మిణి అనే ఒక టీచర్ పాత్ర పోషిస్తున్నట్లు తన పాత్ర గురించి కూడా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇదే ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం పిలుపు వచ్చినప్పుడు.. డైరెక్టర్ మురళి కాంత్ ఈమెను సంప్రదించి.. ఇందులో మీరే లీడ్ రోల్ అని చెప్పగానే తనలో తానే ఎగ్జైట్ అయిపోయి.. వారి ముందు కామ్ గా ఉన్నా.. తన మైండ్ లో డాన్స్ చేశానని ఆ క్రేజీ మూమెంట్స్ ని కూడా పంచుకుంది.

నా ఫేవరెట్ హీరో అతడే:

ఇకపోతే బాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ, తాను ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను కలిసినప్పటికీ తనకు షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ ను కలవలేదు అని కూడా ఆఫియా సయ్యద్ తెలిపింది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన తెరపై పండించే ఆన్ స్క్రీన్ లవ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. అలాంటి ప్రేమ చూపించే వారు నా లైఫ్ లోకి వేస్తే నా జీవితం ధన్యమవుతుంది అంటూ కూడా తెలిపింది.

Advertisement

also read:అక్కినేని హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి!

మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశాను – ఆఫియా

ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఆమె చెబుతూ సోషియాలజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశానని చెప్పిన ఆఫియా.. కాలేజీలో చదువుకునే సమయంలోనే కాస్టింగ్ అసిస్టెంట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని తెలిపింది. థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశానని చెప్పుకొచ్చింది. ముఖేష్ చాప్రా దగ్గర కూడా తాను పనిచేశానని చెప్పుకొచ్చింది.

Tags

Related News

నానికి గొడుగు పట్టిన నితిన్.. అసలు కారణం తెలిస్తే మతి పోవాల్సిందే!

అక్కినేని హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి!

సినిమా హిట్ అవ్వకపోతే సుమ యాంకరింగ్.. నేను సినిమాలు మానేస్తా: నాని

సుకుమార్ పై పందెం గెలిచిన అల్లు అరవింద్!

యూట్యూబ్‌లో టాప్ 10 ట్రెండింగ్ సౌత్ మాస్ మూవీస్ ఇవే!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘వీడొక్కడే’ మూవీ నటుడు!

ఆటో జానీగా ‘కాకా’.. అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

Big Stories

Advertisement
×