Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(revanth reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా మహేష్ బాబు(Mahesh Babu) ఉన్నఫలంగా తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ కావడం సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యింది. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే మహేష్ బాబు ఒక్కసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడంతో వీరి భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు నేడు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో రేవంత్ రెడ్డిని భేటీ అయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఇలా వీరిద్దరి ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో వీరి భేటీ వెనుక ఉన్న కారణం తెలియదు కానీ వీరి మధ్య పలు విషయాల గురించి కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న భారీ మల్టీప్లెక్స్ ఐమ్యాక్స్ (IMAX) థియేటర్ డిసెంబర్ 18వ తేదీ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి కలిసారా అంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే డిసెంబర్ ఏడవ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ముందుగానే వీరిద్దరూ బేటి కావడంతో మహేష్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారా? అందుకే ముఖ్యమంత్రిని కలిసారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి కలవడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది..
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వారణాసి(Varanasi) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటిసారి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని 2027 ఏప్రిల్ ఏడవ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి మరి నిజంగానే వాయిదా పడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: నానికి గొడుగు పట్టిన నితిన్.. అసలు కారణం తెలిస్తే మతి పోవాల్సిందే!