E-Paper
Advertisement

‘అలియాస్ రుక్మిణి’ నా వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయ్యింది: ఆఫియా సయ్యద్

‘అలియాస్ రుక్మిణి’ నా వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయ్యింది: ఆఫియా సయ్యద్
Advertisement

Aafiya Sayed: యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘అలియాస్ రుక్మిణి’. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇందులో ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తోంది.మూవీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు టీమ్ .ఇక అందులో భాగంగా హీరోయిన్ తాజగా బిగ్ టీవీ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా తనకు తొలి తెలుగు సినిమా అయినా, తన లైఫ్‌కి చాలా దగ్గరగా అనిపించిందని తను చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు చూద్దాం..

టైటిల్‌తోనే మొదలైన ఫీలింగ్:

‘అలియాస్ రుక్మిణి’ అనే పేరు వినగానే తనకు లోపల ఎక్కడో ఒక స్పెషల్ ఫీలింగ్ వచ్చిందని ఆఫియా చెప్పడం వెనుక ఒక చిన్న కారణమే ఉంది. తన పేరులోనూ రుక్మిణి ఉండటం వల్ల ఆ టైటిల్ తనకు మరింత దగ్గరైంది. షూటింగ్ మొదలవడానికి కేవలం పది రోజులే టైమ్ ఉండటంతో, తను అసలు ఆలస్యం చేయలేదు. తెలుగు టీచర్ దగ్గర కూర్చుని, మామూలు గ్రామర్ లా కాకుండా డైరెక్ట్ స్క్రిప్ట్‌నే క్లాస్‌లా మార్చుకుని లైన్లు నేర్చుకుంది. సెట్‌లో తను చాలా స్పీడ్‌గా, ఎక్కువగా మాట్లాడే క్యారెక్టర్ చేయాలి కదా, తెలుగులో అలా మాట్లాడటం మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా తర్వాత బాగా ఎంజాయ్ చేసిందట. డబ్బింగ్ చెప్పేటప్పుడు యాస, లిప్-సింక్ సెట్ అవ్వక మూడు గంటలు కష్టపడ్డ విషయం కూడా తను దాచుకోకుండా చెప్పేసింది.

కాటన్ చీరలు, టీచర్ వేషం, లైఫ్‌తో సింక్:

Advertisement

ఈ సినిమాలో తను 40 నుంచి 50కి పైగా చీరలు కట్టిందట. వాటిలో కాటన్ చీరలు వేసుకున్నప్పుడల్లా తనకు అమ్మమ్మ గుర్తొచ్చేవారట. కేరళకు చెందిన తన అమ్మమ్మ టీచర్‌గా చేసేవారని, ఇప్పుడు తను కూడా ఈ సినిమాలో టీచర్‌గా చేయడం తన లైఫ్‌తో సింక్ అయిందని సంతోషంగా చెప్పింది. మామూలుగా ఇంట్లోనో, బయటనో వెస్ట్రన్ డ్రెస్సులకే అలవాటు పడ్డ తనకు, ఈ చీరల లుక్, ఇందులో క్యారెక్టర్‌కి ఉన్న ఫ్రీడమ్ కొత్తగా, చాలా బాగా అనిపించాయట.

also read: మహిళలంటే రోబోలు కాదు.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్!

సెట్‌లో జరిగిన సరదా గొడవలు, ప్రీ-రిలీజ్ స్పీచ్:

Advertisement

సెట్‌లో తనని చూసి చాలామంది ఇక్కడి అమ్మాయేనేమో అనుకుని డైరెక్ట్ తెలుగులో మాట్లాడేసేవారట. దాంతో వాళ్లకి ఆన్సర్ ఇవ్వడానికి కూడా కొన్ని మాటలు నేర్చుకోవాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పింది. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే, తొలిరోజు లుక్ టెస్ట్‌కి వేరేలా ఉన్న తను, ఢిల్లీ అమ్మాయిలా మోడ్రన్ డ్రెస్‌లో వ్యాన్ దిగి రాగానే, సెట్‌లో వాళ్లంతా “మనం తీసుకున్న అమ్మాయి ఈమేనా?” అని కంగారు పడ్డారట. ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడదామని ఒక స్పీచ్ రాసుకుందట. మర్చిపోతే చూసి చదవడానికి ఆ పేపర్‌ని కూడా వెంట తీసుకెళ్తున్నానని చాలా సింపుల్‌గా చెప్పేసింది.

Related News

క్లిన్ కారా చదువుతున్నది సమంత స్కూల్లోనేనా.. ఉపాసన పోస్టు వైరల్!

తొలిసారి IFFIకి వెళ్లిన సాన్వే మేఘన.. అక్కడి అనుభవం ఎలా ఉందంటే!

మహిళలంటే రోబోలు కాదు.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్!

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. పెద్ద స్కెచ్ వేశారుగా?

అలియాస్ రుక్మిణీ అంటే ఏంటో చెప్పిన హీరోయిన్!

నానికి గొడుగు పట్టిన నితిన్.. అసలు కారణం తెలిస్తే మతి పోవాల్సిందే!

అక్కినేని హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి!

Big Stories

Advertisement
×