BigTV English
Advertisement

Danush Emotional: కుబేర చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ధనుష్.. తెలుగు డైరెక్టర్లకు రుణపడాల్సిందే!

Danush Emotional: కుబేర చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ధనుష్.. తెలుగు డైరెక్టర్లకు రుణపడాల్సిందే!

Dhanush Emotional :కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా సింగర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ధనుష్ (Danush). మల్టీ టాలెంటెడ్ హీరోగా ఎప్పటికప్పుడు తనలో ఉన్న సరికొత్త టాలెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ తనదైన శైలిలోనే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల తెలుగులో సార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన ధనుష్ తాజాగా కుబేర(Kuberaa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. నేడు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కుబేర సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.


ఎమోషనల్ అయిన ధనుష్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కుబేర సినిమా మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది ఇక ఇందులో ధనుష్ ఒక బెగ్గర్ (Begger)పాత్రలో కనిపించారు. తన కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇలాంటి పాత్రలో కనిపించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తన పాత్రకు ధనుష్ ప్రాణం పోసారనే చెప్పాలి. థియేటర్లో ఈయన నటనకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది.


బెగ్గర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం..

ఇక నేడు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రావడంతో చిత్ర బృందం థియేటర్లలో ప్రేక్షకుల సమక్షంలో ఈ సినిమాని వీక్షించారు. ఈ క్రమంలోనే ధనుష్ సైతం ఓ థియేటర్ లో ఈ సినిమా చూశారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న తీరు చూసి ఆయన ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. బెగ్గర్ పాత్రలోకి ధనుష్ పరకాయ ప్రవేశం చేసి మరి నటించారని చెప్పాలి.  ఇలా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ హీరోలకు హిట్లు ఇస్తున్న తెలుగు డైరెక్టర్లు

ఇకపోతే ధనుష్ గత కొంతకాలంగా తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడ కూడా ఎంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల ఈయన నటించిన సార్ సినిమా కూడా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేశారు. ఇప్పుడు కూడా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించి హిట్ కొట్టారు. ఇలా రెండు హిట్ సినిమాలను అందించిన టాలీవుడ్ డైరెక్టర్లకు ఈయన ఎంతో రుణపడి ఉన్నారని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో తెలుగు డైరెక్టర్లు అందరూ కూడా తమిళ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నారు. సార్, ఊపిరి, కుబేర, లక్కీ భాస్కర్, వారసుడు వంటి సినిమాలకు తెలుగు దర్శకులు పని చేస్తూ సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఇకపోతే తమిళ డైరెక్టర్లతో తెలుగు హీరోలు నటించిన గేమ్ చేంజర్, స్పైడర్, కస్టడీ, వారియర్ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా తెలుగు హీరోలకు ఫ్లాప్, తమిళ హీరోలకు హిట్లు ఇస్తున్న నేపథ్యంలో తెలుగు సినీ ప్రేక్షకులు కూడా కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Nagarjuna: వేల కోట్లకు అధిపతి.. రూ.10 కోసం నాగ్ అన్ని ఇబ్బందులు పడ్డారా?

Related News

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×