Watch Video: ఈ ప్రపంచంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నాయి. వీటిలో చాలామందికి ఫుట్ బాల్ అంటే ఇష్టం. అయితే చాలా దేశాలలో మాత్రం క్రికెట్ అంటే పడి చచ్చిపోతారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్ చూడడానికి అలాగే ఆడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇందుకు తగ్గట్లుగానే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు, ప్రభుత్వాలు కూడా క్రికెట్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి.
Also Read: Viral Video: బుడ్డోడే కానీ మహానుభావుడు… MS ధోని కంటే తోపు హెలికాప్టర్ షాట్స్ ఆలాడుతున్నాడు
దీంతో గ్రామస్థాయిలో కూడా క్రికెట్ కి ఎంతో ఆదరణ లభిస్తుంది. ప్రతి ఏరియాలో కూడా గ్రౌండ్ ఉండడంతో చాలామంది క్రికెట్ ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని ఏళ్ల క్రితం వరకు పురుషుల క్రికెట్ తో పోలిస్తే మహిళల క్రికెట్ కి ఉండే ఆదరణ తక్కువ. మహిళల క్రికెట్ మ్యాచ్ లు చూసేవారి సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉండేది. ఆఖరికి మహిళా క్రికెటర్లకు చెల్లించే జీతాలు, సదుపాయాల్లో కూడా వ్యత్యాసం ఉండేది.
కానీ ఇప్పుడు పురుషులతోపాటుగా మహిళా క్రికెటర్లకు కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. దీంతో మహిళా క్రికెటర్లని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతోమంది క్రికెట్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక గల్లిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు క్రికెట్ ఆడటం చూస్తూనే ఉంటాం. మహిళలు కూడా ఇలా గల్లీలో క్రికెట్ ఆడడం సాధారణంగా మారింది.
ఈ క్రమంలో తాజాగా ఓ లేడీ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుర్కా ధరించిన ఆ లేడీ భయంకరంగా బ్యాటింగ్ చేస్తోంది. బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ లో సిక్స్ బాధింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆమె బ్యాటింగ్ కి ఫిదా అయిపోయారు. ఏకంగా {సర్పంచ్ సాబ్} శ్రేయస్ అయ్యర్ తో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె శ్రేయస్ అయ్యర్ కంటే దారుణంగా ఆడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Shubham Gill: ఇంగ్లాండ్ పై కసి.. 5 గంటలకే నిద్ర లేచి.. ఐస్ వాటర్ లో స్నానం.. గిల్ డైట్ ఇదే…
ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ రేంజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంజాబ్ జట్టును ఫైనల్స్ వరకు తీసుకు వెళ్లిన సర్పంచ్ సాబ్ కు యూత్ సలాం కొట్టింది. అటు కెప్టెన్సీ తో, ఇటు బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు అయ్యర్. ఈ సీజన్ లో 604 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలతో పాటు క్వాలిఫైయర్ 2 లో ముంబై పై చేసిన 87 పరుగులే హైలెట్. ఒంటి చేత్తో పంజాబ్ విజయాల్లో కీలకంగా మారిన శ్రేయస్ అయ్యర్ తో ఈ బుర్కా ధరించి సిక్స్ బాదిన లేడీని పోలుస్తూ అభినందిస్తున్నారు క్రీడాభిమానులు. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">