Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వారిలో కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ఒకరు. ఈయన నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన నాగార్జున ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో క్యామియో పాత్రలలో(Cameo Role) నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా (Kubera)ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా భారీగా నిర్వహిస్తున్నారు.
తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల నటుడు నాగార్జున ఇద్దరు కలిసి నాగచైతన్యతో(Nagachaitanya) ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య సినిమాకు సంబంధించిన విషయాలు గురించి మాత్రమే కాకుండా నాగార్జున అలాగే శేఖర్ కమ్ముల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ప్రస్తావించారు. ఇక కుబేర సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో నాగచైతన్య కూడా డబ్బు గురించి ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య నాగార్జునని ప్రశ్నిస్తూ… మీకు ఎప్పుడైనా నా దగ్గర 10 రూపాయలు ఉంటే బాగుండు అని అనుకున్నారా? అంటూ ప్రశ్నలు వేశారు.
సిగరెట్ ప్యాక్ కోసం…
ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ చాలా సందర్భాలలో అనిపించిందని తెలియజేశారు. ముఖ్యంగా హాస్టల్ కి వెళ్లే సమయంలో ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే అయిపోయేవి తరువాత మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ సమయంలో డబ్బులు ఉంటే బాగుండని చాలా అనిపించిందని తెలిపారు. ముఖ్యంగా సిగరెట్ ప్యాక్ కోసం చాలా సందర్భాలలో మన దగ్గర డబ్బులు ఉంటే బాగుండు అనిపించింది అంటూ నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక శేఖర్ కమ్ముల కూడా చాలా సందర్భాలలో అనిపించిందని తెలిపారు. నాగార్జున ఇలా సమాధానం చెప్పడంతో ఇప్పుడు కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన నాగార్జున చదువుకునే సమయంలో పది రూపాయలు కోసం ఇంతలా ఎదురు చూస్తూ ఇబ్బంది పడ్డారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో రూ. 10 పెద్ద నోటు..
ఇక మీ నాన్నగారి జోబు నుంచి మీరు కొట్టేసిన పెద్ద అమౌంట్ ఎంత ?అంటూ కూడా ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ అప్పట్లో పెద్ద నోటు అంటే 10 రూపాయలు అంతకుమించి ఎక్కువ కొట్టేసి ఉండనని తెలిపారు. మేము చిన్నపిల్లల అప్పుడు పైసలలో కూడా డబ్బులు ఉండేవని అందుకే పది రూపాయలకు మించి ఎక్కువ కొట్టేసి ఉండనని తెలిపారు. నాగార్జున ఇలా సమాధానం చెప్పడంతో మాకు పెద్ద నోటు అంటే 500 రూపాయలు అంటూ చైతూ చెప్పుకు వచ్చారు. ఇలా వీరి మధ్య డబ్బు గురించి జరిగిన ఈ సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కుబేర సినిమా కూడా ఒక బిచ్చగాడికి ఒక డబ్బున్న వ్యక్తి మధ్య జరిగే పోరాటమని స్పష్టమవుతుంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి. మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Manchu Vishnu: ఆ కన్నప్ప తిన్నాడేమో.. ఈ కన్నప్ప మాత్రం తినలే.. విష్ణు షాకింగ్ కామెంట్స్