E-Paper
Advertisement

గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?

గిరిబాబుకు తీరని కోరిక అదేనా? పుట్టిన రోజంటే ఊరంతా పండుగేనా?
Advertisement

Giri Babu: టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు గిరిబాబు అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈయన 80 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొద్దిరోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇలా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న గిరిబాబు  ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో కన్నుమూశారు. ఇలా ఈయన మరణించారనే వార్త సినీ అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

జీవితం చాలా సంతృప్తిగా ఉంది..

ఇలా గిరిబాబు(Giri Babu) మరణించారని విషయం తెలియడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా గిరిబాబు తన జీవితంలో తీరని కోరికల గురించి పలు విషయాలను తెలిపారు. జీవితంలో మీకు ఏదైనా ఈ పని చేయలేకపోయానని, అసంతృప్తిగా ఉందా తీరని కోరికలు ఏవైనా ఉన్నాయా అంటూ ప్రశ్న వేయడంతో అందుకు గిరిబాబు సమాధానం చెబుతూ.. నా జీవితం చాలా సంతృప్తిగా కొనసాగిందని నాకు జీవితంలో ఎలాంటి తీరని కోరికలు లేవని ఈయన తెలిపారు. తన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉందని గిరిబాబు తెలిపారు.

జీవితంలో ఎలాంటి కోరికలు లేవు..

Advertisement

ఇలా తన జీవితంలో ఎలాంటి తీరని కోరికలు లేవని తన జీవితం సంతోషంగా సాగిందంటూ ఈయన చెప్పిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా తన పుట్టినరోజు వేడుకల గురించి కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గిరిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఏడాది తన సొంత గ్రామంలోనే తన పుట్టిన రోజు జరుపుకుంటానని గిరిబాబు తెలిపారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఊర్లో అందరికీ కచ్చితంగా భోజనాలు ఏర్పాటు చేస్తామని ఈయన తెలిపారు. ప్రతి సంవత్సరం తన సొంత గ్రామంలో ప్రజల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని వారికి భోజనాలు ఏర్పాటు చేసి అక్కడే సినిమాలు వేసి చూపిస్తుంటామని తెలిపారు.

పుట్టినరోజు అంటే ఊరంతా పండుగే..

ఇలా తన పుట్టినరోజు అంటే ఊరంతా కూడా పండుగ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గిరిబాబుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన కొడుకులు రఘుబాబు ఇప్పటికే ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే .ఈయన చిన్న కుమారుడు బోసు బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించారు. అయితే ఈయన సినిమాలలో అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక కుమార్తె ఇండస్ట్రీకి మొదటి నుంచి కూడా దూరంగా ఉన్నారు. ఇక తన పిల్లలు అలాగే మనవళ్ళు, మనవరాళ్ళు కూడా మంచిగా జీవితంలో స్థిరపడ్డారని, విదేశాలలో ఉంటున్నారని గిరిబాబు గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: ఇదేం ట్విస్ట్ సామి.. ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా.. థియేటర్లలో నవ్వుల జాతరే!

Related News

గిరిబాబు పై సీనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించిన మూవీ.. ఏదో.. ఎందుకో తెలుసా?

ఇదేం ట్విస్ట్ సామి.. ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా.. థియేటర్లలో నవ్వుల జాతరే!

గిరిబాబు హీరోగా నటించిన సినిమాలు ఇవే!

వందల సినిమాలలో నటించిన గిరిబాబు.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు.. అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం

చాలా గర్వంగా ఉంది.. మౌనిక పై మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×