Hemanth: ఏపీలో సంచలనంగా మారిన రాప్తాడు కేసు నిందితుడని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు నిందితుడు హేమంత్‌ను తరలించారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్‌ను మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి కర్నూలు జీజీహెచ్‌కు తీసుకొచ్చినట్టు అధికారులు పేర్కోన్నారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు నేతృత్వంలో వైద్య నిపుణుల బృందం రాత్రి వేళలోనే రోగికి అత్యవసర పరీక్షలు నిర్వహించారు. సర్జన్లు, ఆర్థోపెడిక్, కార్డియో థొరాసిక్ మరియు కార్డియాలజీ వైద్యుల బృందం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు.
అయితే వైద్య పరీక్షల్లో నిందితుడి ఊపిరితిత్తుల్లోని కొన్ని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు నిపుణులు గుర్తించారు. కార్డియాలజీ వైద్యుల బృందం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలన చేసారు. వైద్య పరీక్షల్లో నిందితుడి ఊపిరితిత్తుల్లోని కొన్ని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన రక్తపు గడ్డలను కరిగించేందుకు ప్రత్యేక వైద్య చికిత్సను కర్నూలు జీజీహెచ్ వైద్యులు ప్రారంభించారు.
ఇక రోగి వార్డును స్వయంగా సందర్శించి ఆరోగ్య పరిస్థితిని సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు సమీక్షించారు. అనంతపురం నుండి వచ్చినప్పుడు కొంత ఆయాసం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయాసం తగ్గి నిందితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. రోగికి 24 గంటల పాటు నిరంతర వైద్య పర్యవేక్షణ అందించాలని సంబంధిత వైద్యాధికారులకు సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక శ్రద్ధతో అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం అధికారిక ప్రకటన చేశారు.
Also read: తమిళనాడు బాలికల లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. యజమాని ఇంట్లో సోదాలు!