E-Paper
Advertisement

చాలా గర్వంగా ఉంది.. మౌనిక పై మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

చాలా గర్వంగా ఉంది.. మౌనిక పై మనోజ్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Manchu Manoj: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న మంచు మనోజ్(Manchu Manoj) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కేవలం హీరోగా సినిమాలు చేయడమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాల పనులలో బిజీగా గడుపుతున్న మనోజ్ మరోవైపు తన భార్య భూమా మౌనిక(Bhuma Mounika)తో కలిసి వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక ఇప్పటికే పలు వ్యాపారాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.

నీ కష్టమే ఈ స్థాయిలో నిలబెట్టింది..

ఈ నేపథ్యంలోనే మంచు మౌనిక వ్యాపార ప్రయాణం పై మనోజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా నమస్తే వరల్డ్(Namaste World) సంస్థ కోసం మౌనిక చేసిన కృషికి ఇప్పుడు సరైన ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ చేశారు. ఇటీవల ఈ దంపతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో స్టార్ట్ కంపెనీకి కీలక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 36 కోట్ల రూపాయలతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే మనోజ్ స్పందిస్తూ .. మౌనిక నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఐదేళ్లుగా ఎంతో పట్టుదలతో నువ్వు చేసిన కష్టమే నేడు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. 31 వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాం..

ఏపీ ప్రభుత్వంతో మనోజ్ దంపతులు ఒప్పంద..

Advertisement

తిరుపతిలో తొలి ఎంఓయు కుదిరిన కేవలం మూడు వారాల వ్యవధిలోనే మరో ఈ ఘనత సాధించాము మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఘనత నీదే. ఏపీలోని కళాకారులు చేనేత కార్మికులు, చేనేత రంగంలోని మహిళలతో కలిసి పని చేయాలనుకుంటున్నాము వారి కలను భారతదేశ కథలను బొమ్మలు యానిమేషన్, రోబోటిక్స్ రూపంలో పిల్లలకు చేరవేయాలేనిది మా కల అని తెలిపారు. ఇటీవల వైజాగ్ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా 36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

Advertisement

ఇలా ఈ ఒప్పందం కుదరడంతో మనోజ్ తన భార్యకు ఎమోషనల్ పోస్ట్ చేస్తూనే మరోవైపు తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మౌనిక చేపట్టిన పనిలో భాగంగా ఎల్లప్పుడూ తనకు అండగా నిలుస్తూనే తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని.. ఇకపై చేయాల్సింది చాలా ఉంది మౌనిక పక్కన నిలబడి తనకు మద్దతుగా, తన వంతు కృషి చేసే అవకాశం రావడం నిజంగా ఆనందంగా ఉందని ఈయన సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మనోజ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Also Read: వర్షిణికి ఫేవర్ గా హౌస్ మేట్స్…పాపం రామకృష్ణ.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి!

.

Related News

చిల్డ్రన్స్ డే స్పెషల్.. వృషకర్మ నుండి ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

14 ఏళ్ల ప్రేమ.. బ్రేకప్.. కాజల్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా!

హీరోయిన్ కంగనా రనౌత్ పై కేస్ ఫైల్?

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

Big Stories

Advertisement
×