E-Paper
Advertisement

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్  హీరోయిన్!
Advertisement

Mahesh Babu:ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీలకు బాగా కలిసి వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ కూడా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు మహేష్ బాబు ‘ అతిథి ‘ సినిమాలో హీరోయిన్గా నటించి పేరు సొంతం చేసుకున్న అమృతారావు (Amrutha Rao) సోదరి ప్రీతిక రావు (Preetika Rao).. ఈమె కూడా హీరోయిన్ కావడం గమనార్హం. గతంలో తెలుగులో ప్రియుడు అనే సినిమా చేసింది. అలాంటి ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకుంది. బెంగళూరులో తమిళ్ – బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో ఈ వివాహ వేడుక జరిగింది.

భర్త ముఖాన్ని దాచేస్తూ ఫోటోలు పంచుకున్న హీరోయిన్..

ఇకపోతే తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న ప్రీతిక.. అందులో తన భర్త ముఖాన్ని మాత్రం దాచి పెట్టేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ విధంగా ఆమె రాసుకుంది. ” గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీ, నా తల్లిదండ్రులు, సోదరి అమృత, బంధువులు, స్నేహితుల ఆశీస్సులతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంగణంలో నా పెళ్లి చాలా ఘనంగా జరిగింది. స్వయంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం నా జీవితంలో ప్రత్యేకమైన మరుపురాని ఘట్టం. సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన నాకు.. ఆ కుటుంబ సంస్కృతి, నా మంగళూరు మూలాలు, కర్ణాటక సాంప్రదాయాలను పోలినట్లు అనిపించింది. వివాహం అనేది వ్యక్తిగతమైన పవిత్రమైన అనుభూతి. అలాంటి మధురమైన క్షణాలను అందరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదు” అంటూ తన ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది. మొత్తానికి అయితే నటనకు పూర్తిగా బ్రేక్ ఇచ్చిన ప్రీతిక ప్రస్తుతం పలు పాడ్ కాస్ట్ వీడియోలు చేస్తూ దూసుకుపోతోంది.

Advertisement

also read:ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు.. అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం

ప్రీతికారావు సినిమా కెరియర్..

2001 నుండి 2019 మధ్యకాలంలో తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో సినిమాలు చేసిన ఈమె.. మూడు సీరియల్స్, రెండు ఆల్బమ్ సాంగ్లలో కూడా నటించింది. మంగళూరు , కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈమె స్వతహాగా మోడల్ . అమృతారావు సోదరి కూడా.. తొలిసారి 2010లో వచ్చిన చిక్కుబుక్కు అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇక అలాగే బెంతెహ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసిన ఈమె.. ఇందులో అలియా జైన్ అబ్దుల్లా పాత్రను పోషించినందుకుగాను మంచి పేరు లభించింది. 2012లో ప్రియుడు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఇక 2019లో హిందీ చిత్రంలో నటించి ఇండస్ట్రీకి దూరమయింది . ఇక అప్పటినుంచి ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది? అనే విషయాలను మాత్రం ఆమె పంచుకోలేదు. అయితే ఇప్పుడు సడన్గా పెళ్లి ప్రకటన చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది ప్రీతికారావు.

Advertisement

Related News

ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు.. అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం

చాలా గర్వంగా ఉంది.. మౌనిక పై మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

చిల్డ్రన్స్ డే స్పెషల్.. వృషకర్మ నుండి ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

14 ఏళ్ల ప్రేమ.. బ్రేకప్.. కాజల్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా!

హీరోయిన్ కంగనా రనౌత్ పై కేస్ ఫైల్?

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

Big Stories

Advertisement
×