Actor Giri Babu: సినీ నటుడు గిరిబాబు మరణించారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. గత ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 600కు పైగా సినిమాలలో నటించిన గిరిబాబు(Giri Babu) అనారోగ్య సమస్యల కారణంగా వయసు పైబడటంతో ఆసుపత్రి పాలయ్యారు. ఇలా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నేడు కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఇక ఈయన పార్తివదేహాన్ని ఈరోజు సాయంత్రం ఫిలిమ్ చాంబర్లో ఉంచి తమ స్వగ్రామానికి తీసుకు వెళ్లి అక్కడే అంత్యక్రియలను నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది.
ఇలా సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన గిరిబాబు మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇక గిరిబాబు మరణించడంతో ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గిరిబాబు 1973వ సంవత్సరంలో జగమే మాయ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు .అయితే కెరియర్ మొదట్లో ఈయన విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా విలన్ గా తన నటనతో మెప్పించిన గిరిబాబు హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు.
గిరిబాబు హీరోగా నటించిన సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈయన హీరోగా నటించిన సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే..
*గిరిబాబు హీరోగా ‘మునసబు గారి అల్లుడు’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈయన పూర్తిస్థాయి హీరో పాత్రలో నటించారు.
* ‘వధూవరులు’ ఈ సినిమాలో గిరిబాబు, చంద్రమోహన్ కలిసి ప్రధాన కథానాయకులుగా నటించారు.
*’చందన’ ఈ సినిమాకు చంద్రమోహన్ దర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా హీరోగా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమాలతో పాటు చండీ, స్వామి ద్రోహులు, దేవతలారా దీవించండి సినిమాలలో కూడా గిరిబాబు ప్రధాన పాత్రలో నిర్మించారు . దేవతలారా దీవించండి సినిమాకు గిరిబాబు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఇంద్రధనస్సు, మనస్సాక్షి, దొంగల దోపిడి, సింహ గర్జన వంటి సినిమాలలో ఈయన హీరోగా, అలాగే కీలక ప్రధాన పాత్రలలో నటించారు. ఇక గిరిబాబు విలన్ హీరోగా మాత్రమే కాకుండా ఈయన దర్శకుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఇలా ఐదు దశాబ్దాల పాటు వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇక లేరనే వార్త అభిమానులకు జీర్ణించుకోలేనిదని చెప్పాలి.
Also Read: వందల సినిమాలలో నటించిన గిరిబాబు.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?