E-Paper
Advertisement

ప్రముఖ నటుడు గిరిబాబు మృతి!

ప్రముఖ నటుడు గిరిబాబు మృతి!
Advertisement

Giri Babu:చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కి చెందిన మరో సీనియర్ నటుడు మృతి చెందారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (Giribabu). 80 సంవత్సరాల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన..( నవంబర్ 14న ) కాసేపటి క్రితం హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు గిరిబాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 600కు పైగా చిత్రాలు..

1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు గిరిబాబు. చిన్నతనం నుండే నాటక రంగం పట్ల ఆసక్తి ఉండడంతో.. అదే ఆసక్తితో ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించారు . అలా 1973లో విడుదలైన ‘జగమే మాయ’ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు గిరిబాబు. 1977లో ‘దేవతలారా దీవించండి’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారారు. పచ్చని సంసారం, మేస్త్రి ,నా పెళ్ళాం నా ఇష్టం, ఎవడైతే నాకేంటి, కితకితలు, డిస్కో రాజా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా , ప్రతి నాయకుడిగా ,హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు.

దర్శకుడిగా కూడా ప్రయాణం..

Advertisement

సీనియర్ నటుడు రవిబాబు నటుడిగా , నిర్మాత గానే కాకుండా దర్శకుడిగా కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలా 1977లో వచ్చిన దేవతలారా దీవించండి, సింహ గర్జన, మెరుపు దాడి, రణరంగం వంటి చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు.

also read:చిల్డ్రన్స్ డే స్పెషల్.. వృషకర్మ నుండి ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

వారసులు కూడా ఇండస్ట్రీకి చెందిన వారే..

Advertisement

గిరిబాబు వారసులు రఘుబాబు, బోస్ బాబు కూడా సినీ నటులే కావడం విశేషం… గిరిబాబు మొదటి వారసుడు రఘుబాబు 1988 నుండే తెలుగు చిత్రాలలో చురుకుగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతులైన కమెడియన్లలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు. మురారి, ఖడ్గం, ఆది, ఎఫ్2 , సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలలో తన పాత్రలతో మరింత ప్రసిద్ధి పొందారు. ఇక అంతేకాదు ఈయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. బోస్ బాబు విషయానికి వస్తే.. తన తండ్రి , సోదరుడి లాగానే చిత్ర సీమలో నటనను కొనసాగించారు. గిరిబాబు దర్శకత్వంలో వచ్చిన ఇంద్రజిత్ సినిమాతో బోసు బాబు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే తన అన్న రఘుబాబు లాగా బోసు బాబు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు.

Related News

చాలా గర్వంగా ఉంది.. మౌనిక పై మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

చిల్డ్రన్స్ డే స్పెషల్.. వృషకర్మ నుండి ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

14 ఏళ్ల ప్రేమ.. బ్రేకప్.. కాజల్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా!

హీరోయిన్ కంగనా రనౌత్ పై కేస్ ఫైల్?

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

Big Stories

Advertisement
×