Giri Babu Death: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన సీనియర్ నటుడు గిరిబాబు (80) (Giri Babu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఒక ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూశారు. ఇలా గిరిబాబు మరణ వార్త తెలిసిన చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇక ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఈయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ఇలా గిరిబాబు మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఈ నేపథ్యంలోనే గిరిబాబు నటించిన సినిమాలు ఆయన సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. గిరిబాబు 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు. ఈయన 1973లో “జగమే మాయ”(Jagame Maya) అనే సినిమాతో విలన్ గా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు .ఇలా సుమారు 600కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన గిరిబాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, విలన్ గా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.
ఇలా 600 లకు పైగా సినిమాలలో నటుడిగా మెప్పించిన ఈయన భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది. గిరిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లాలో కూడా భారీగా భూములు కొనుగోలు చేశారని తెలుస్తోంది .అదేవిధంగా హైదరాబాదులో కూడా ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈయన నిర్మాతగా మారి ఒకానొక సమయంలో తన ఆస్తులు అన్నింటిని కోల్పోయినప్పటికీ తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారని సమాచారం.
ఇక గిరిబాబుకు ముగ్గురు సంతానం కాగా, ఇప్పటికే ఈయన పెద్ద కుమారుడు రఘు బాబు(Raghu Babu) ఇండస్ట్రీలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక చిన్న కుమారుడు బోసు బాబు మాత్రం పలు సినిమాలలో నటించినా కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఈయన నటుడిగా తన చివరి రోజుల వరకు కూడా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈయన చివరిగా అన్నీ మంచి శకునములే అనే సినిమా ద్వారా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేశారు. 2023లో విడుదలైన ఈ సినిమా గిరిబాబు ఆఖరి సినిమా. ఈ సినిమా తర్వాత ఈయన వయసు రీత్యా అనారోగ్యానికి గురికావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా అనారోగ్య సమస్యల కారణంగా ఈయన నేడు కన్నుమూశారు.
Also Read: చాలా గర్వంగా ఉంది.. మౌనిక పై మనోజ్ ఎమోషనల్ పోస్ట్!