Oo Torture Prema Teaser: శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. ఈ చిత్రం లో మాదాల రంగారావు మనవడు మాదాల రవి అబ్బాయి సన్నీ మాదాల హీరోగా, మౌనిక వీర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “ఓ టార్చర్ ప్రేమ” టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఎడిటర్ ప్రతీక్ నూటి మాట్లాడుతూ – ఒక పది మంది స్నేహితులం కలిసి ఈ సినిమాను ఏడాది పాటు కష్టపడి చేశాం. ఒక బ్యూటిఫుల్ మూవీ చేశామనే సంతోషం మా అందరిలో ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మేమంతా నమ్ముతున్నాం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఇషాక్ వలీ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీకర్ కు థ్యాంక్స్. టీజర్ ఎంత బాగుందో మా మూవీ ట్రైలర్ అంతకంటే బాగుంటుంది. మా చిత్రాన్ని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సామి మాట్లాడుతూ – ఒక మంచి ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను కంప్లీట్ గా థియేటర్స్ లో మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ఫ్రెష్ కంటెంట్ ఉన్న సినిమాను మన ఆడియెన్స్ హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. అన్నారు.
హీరోయిన్ మౌనిక వీర్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో మానస అనే క్యారెక్టర్ చేస్తున్నాను. నేను ఇలాంటి వేదిక మీద నిల్చొని మాట్లాడేందుకు ఆరేళ్లు పట్టింది. నాకు ఈ సినిమాతో ఎంతోమంది స్నేహితులు లభించారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చి మా అందరికీ సపోర్ట్ గా నిలబడ్డారు శ్రీకర్ కృష్ణ. ఆయన టీమ్ లోని ప్రతి ఒక్కరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ మా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 11న మా మూవీని చూసి సక్సెస్ చేయండి. అన్నారు.
డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ – మేమంతా కొత్త వాళ్లం కలిసి ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశాం. మాకు ఎవరి సపోర్ట్ లేదు. అయినా మేము బాధపడటం లేదు. ఒక మంచి సినిమా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నామని గర్వపడుతున్నా. మా సినిమా పాటల్ని టీ సిరీస్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేసింది. మా మూవీని మైత్రీ డిస్ట్రిబ్యూషన్స్ వంటి ప్రెస్టీజియస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఎలాంటి వల్గారిటీ లేని బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. అందరూ ఎంజాయ్ చేసే కామెడీ మా మూవీలో ఉంటుంది. ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ సినిమా అంత ప్యూర్ గా ఉంటుంది. ఈ జర్నీలో సపోర్ట్ గా నిలిచిన నా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో సన్నీ మాదాల మాట్లాడుతూ – ఈ సినిమాకు వచ్చే క్రెడిట్ అంతా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీకర్ కృష్ణ కే దక్కాలి. ఆయనే అన్నీ దగ్గరుండి మా సినిమా చేశారు. ఈ చిత్రానికి టార్చర్ ఏదైనా ఉంటే ఆయనే తీసుకున్నారు. ప్రేమను మాత్రం మాకు పంచారు. మా టెక్నీషియన్స్ అంతా సినిమాకు ఎంతో బలాన్నిచ్చారు. హీరోయిన్ మౌనిక తొలి చిత్రమైనా ఎంతో కాన్ఫిడెంట్ గా నటించింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నా ఫ్యామిలీ మెంబర్స్ నిలబడ్డారు. ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేశాను. మా మూవీ ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. అన్నారు.
నటీనటులు : సన్నీ మాదాల, మౌనిక వీర్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు, తదితరులు.
టెక్నీషియన్స్
———————
రచన, నిర్మాత, దర్శకుడు: శ్రీకర్ కృష్ణ
సినిమాటోగ్రఫీ : సామి
ఎడిటర్: ప్రతీక్ నూటి
సంగీతం: ఇషాక్ వలి
డీఐ – పి.వి.బి. భూషణ్
పబ్లిసిటీ – థింక్ పోస్టర్స్
పి.ఆర్ -సతీష్
డిజిటల్ : కలర్ ఫుల్ డిజిటల్ మీడియా
Also Read: కెప్టెన్ అయ్యాక కొమ్ములొచ్చాయా? అమన్ మసూద్ కు క్లాస్ పీకిన నాగార్జున!