E-Paper
Advertisement

క్రిస్మస్‌కు ముందే హీట్ పెంచిన సాయి మంజ్రేకర్.. గ్రీన్ డ్రెస్‌లో అదిరిపోయే అందాలు!

క్రిస్మస్‌కు ముందే హీట్ పెంచిన సాయి మంజ్రేకర్.. గ్రీన్ డ్రెస్‌లో అదిరిపోయే అందాలు!
Advertisement

Sai Manjrekar:ఇంకా క్రిస్మస్ రానే లేదు.కానీ అప్పుడే సోషల్ మీడియా లో సెలబ్రిటీలు తమ తమ అకౌంట్స్ లో అప్పుడే ఫెస్టివల్ వైబ్ మొదలెట్టేస్తున్నారు.ముఖ్యంగా హీరోయిన్లు తమ స్పెషల్ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ సాయి మంజ్రేకర్ షేర్ చేసిన ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ముఖ్యంగా గ్రీన్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిపోతూ, తన గ్లామర్‌తో ఫాలోవర్స్ మైండ్ ని బ్లాంక్ చేస్తుంది.

Advertisement

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలను పోస్ట్ చేసిన సాయి మంజ్రేకర్.. ‘Doom has a dress code’ అంటూ క్రిస్మస్‌కు సంబంధించిన ఫన్నీ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పండగ థీమ్‌కు తగ్గట్టుగా ఎంచుకున్న గ్రీన్ డ్రెస్, స్టైలిష్ హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్‌తో సాయి లుక్ చాలా స్పెషల్‌గా ఉందని చెప్పాలి.

మొత్తంగా సాయి మంజ్రేకర్‌కు ఫ్యాషన్ విషయంలో మంచి టేస్ట్ ఉందని ఈ ఫొటోలు చూస్తేనే అర్థమవుతోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన క్రేజీ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది ఈ భామ.

Advertisement

అందుకే ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక సినిమాల విషయానికి వస్తే ..సాయి మంజ్రేకర్ జర్నీ బాలీవుడ్‌లోనే మొదటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దబాంగ్ 3’ సినిమాతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ కొట్టేసింది.ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైంది. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మాయ క్యారెక్టర్‌లో కనిపించి ఆడియన్స్ ని ఫిదా చేసింది.

ఇక అదే ఏడాది అడివి శేష్ హీరోగా వచ్చిన ‘మేజర్’ సినిమాలో ఇషా పాత్రతో ఆడియన్స్‌ను మెప్పించిన ఈ అమ్మడు రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘స్కంద’ సినిమాలో కూడా తళుక్కుమంది.అలాగే హిందీలో ‘కుచ్ ఖట్టా హో జాయ్’, అజయ్ దేవగణ్, టబు నటించిన ‘ఔరోన్ మే కహా దమ్ థా’ లాంటి సినిమాల్లోనూ నటించి తన సత్తా ఏంటో చూపెట్టింది.

ఇక రీసెంట్ గా వచ్చిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటించి మరోసారి తెలుగు ఆడియన్స్ ని అలరించింది.మొత్తానికి కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా సరి కొత్త క్యారెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఇండియా హౌస్’ అనే ప్రాజెక్ట్ ని పట్టేయగా దీనిని రామ్ చరణ్ ప్రెసెంట్ చేయడం విశేషం..మొత్తానికి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న సాయి మంజ్రేకర్, ఈసారి క్రిస్మస్ స్పెషల్ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిపొయిందన్న మాట !

Tags

Related News

అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తున్న సుధాకర్.. అసలు కారణం బయట పెట్టిన కొడుకు!

37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!

డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టిన అనిల్ రావిపూడి.. కామెడీకి బ్రేక్ పడినట్లేనా?

ఇడుపు కాయితం’ నుంచి మరో మెలోడీ.. పాట వింటే ఫిదా అవ్వాల్సిందే!

వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..

కింగ్ 100లో నాగచైతన్య క్యామియో…హైప్ పెంచేసిన చైతూ!

మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్.. వేణు మాధవ్ తొలి మూవీ సంపాదన?

Big Stories

Advertisement
×