BigTV English

Naresh in K Ramp : నరేష్‌ పాత్రను తీసుకునే ముందు డైరెక్టర్ ఆలోచించాల్సింది

Naresh in K Ramp : నరేష్‌ పాత్రను తీసుకునే ముందు డైరెక్టర్ ఆలోచించాల్సింది
Advertisement

Naresh in K Ramp : సీరియర్ నటుడు నరేష్ ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపిస్తున్నాడు. మొన్నా మధ్య సామజవరగమన అనే సినిమాల్లో ట్రెండీ లుక్స్‌తో కనిపించే అంకూల్ పాత్ర చేశాడు. ఆ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఆ సినిమాలో నరేష్ యాక్టింగ్… డైలాగ్ డెలవరీ అన్నీ కూడా బాగా కుదిరాయి. ఇప్పుడు అచ్చం అలాంటి పాత్రే ఈ రోజు రిలీజ్ అయిన కె ర్యాంప్ మూవీలో ఉంది. అయితే ఈ సారి మాత్రం నరేష్‌కు అప్లాజ్ కాదు… ట్రోల్స్ పడుతున్నాయి.


సినిమాలో నరేష్… హీరోకు మామ పాత్రలో కనిపిస్తాడు. సామజవరగమన సినిమాలో కనిపించినట్టే ట్రెండీ లుక్స్‌తో ఉన్న అంకూల్ పాత్ర ఆయనది. అంటీల నడుము టచ్ చేస్తూ ఉండిపోయే పాత్ర అది. ఆ టచ్ వెనక ఓ స్టోరీ పెట్టారు. ఆ స్టోరీని కన్‌క్లూడ్ చేయకపోవడం మైనసే. అలాంటి టైంలో… ఈ టచ్ కాన్సెప్ట్ అనేది కావాలనే ఇరికించినట్టు అనిపిస్తుంది.

నరేష్ రియల్ స్టోరీనే…

ఈ టచ్ కాన్సెప్ట్ ని పక్కన పెడితే… 60 ఏళ్ల వయసుకు వచ్చినా… చేయొచ్చు అంటూ అడల్టరీ డైలాగ్స్ మితిమీరి చెబుతాడు. 40 ఏళ్లకే డల్ అయ్యే జరనేషన్ మీది… 60 వచ్చినా… చేసే జనరేషన్ మాది అంటూ కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. పని చేసేంత కాలం… కామం ఉంటుంది అనే ఘొరమైన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో పెట్టారు. ఇవి అన్నీ కూడా నరేష్ రియల్ లఫ్ లోని అంశాలనే తీసుకున్నారా.. అనే డౌట్ థియేటర్ లో కూర్చన్న ప్రేక్షకుడికి వస్తుంది. అలా ఎందుకు అంటే.. నరేష్ వయసు 60 ఏళ్లు. ఆయన ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. వీటి వల్ల సినిమా చూసేటైంలో అలాంటి ఫీల్ వస్తుంది.


ఇక సినిమాలో నరేష్ నుంచి వచ్చిన బూతులు చాలా ఉన్నాయి. తన కొడుకును పట్టుకుని.. ఆ క్షణం అక్కుర్తి పడకపోతే బాగుండు… ఆ క్షణం కండోమ్ వాడాల్సింది… ఆ క్షణం జాగ్రత్త పడాల్సింది అంటూ వల్గర్ వర్డ్స్ వాడుతాడు. ఇంకా ఇలాంటి సినిమాలో నరేష్ నుంచి వచ్చే డైలగ్స్ కోకొల్లలు.

హీరోకు నరేష్ ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్పి… “రోజు రాత్రి తన భార్య మొహంపై గుడ్డ వేస్తా అర్థం చేసుకోలేకపోతుంది పిచ్చిది” అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. ఆ టైంలో థియేటర్‌లో ఉన్న ఆడియన్స్ అందరికీ జుగుప్సాకరంగానే అనిపిస్తుంది. నరేష్ సీన్స్ వచ్చే టైంలో ఆడియన్స్ కూడా మొహంపై గుడ్డ వేసుకోవాల్సింది అని అనుకునేలా ఉన్నాయి ఆ డైలాగ్స్.

నరేష్‌ను చూసి తన కొడుకు పాత్ర అయిన కిషోర్ … “ఇంతకంటే దిగజారిపోవు అని అనుకునే ప్రతి సారి నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావ్ నాన్న” అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. నిజానికి ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడికి కూడా అదే డైలాగ్ అనాలని అనిపిస్తుంది.

సినిమాలో నరేష్ ఎపిసోడ్‌ని చాలా వరకు ట్రిమ్ చేస్తే, ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బంది లేకుండా సినిమా చేస్తారు. సినిమా ప్రమోషన్స్‌లో తమ సినిమా A సర్టిఫికేట్ మూవీ అయినా… ఫ్యామిలీతో చూడొచ్చు అని చెప్పాడు హీరో కిరణ్ అబ్బవరం. అది జరగాలంటే… నరేష్ నుంచి బూతులు వచ్చే సీన్స్ తొలగించాలి. లేకపోతే.. అది ఫ్యామిలీలు చూసే మూవీ అవ్వొద్దు అనే చెప్పొచ్చు.

Related News

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Diwali Movies: బాక్సాఫీసు వద్ద పేలని సినిమాలు.. ఈ దీపావళికి నో ఎంటర్‌టైన్‌మెంట్‌!

Tom – Ana de: అంతరిక్షంలో పెళ్ళన్నారు.. 9 నెలలకే బోర్ కొట్టేసిందా టామ్!

Sukumar -Ramcharan: RC 17 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. మరింత ఆలస్యంగా పుష్ప 3!

Big Stories

×