Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక త్వరలోనే థామా(Thamma) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఈమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)సినిమా కూడా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె థామా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు. అదేవిధంగా ఈమెకు ఇంటర్వ్యూ సందర్భంగా తన నిశ్చితార్థం(Engagment) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ రష్మికకు అభినందనలు తెలియచేయగా రష్మిక ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా రష్మిక ఆశ్చర్యపోగానే సదరు యాంకర్ మీ పర్ఫ్యూమ్ లైన్ గురించి మాట్లాడుతున్నానని తెలియజేస్తూ ఇంకా ఏదైనా ఉందా? అంటూ ప్రశ్న వేశారు.
యాంకర్ పరోక్షంగా రష్మిక నిశ్చితార్థం గురించి ప్రశ్నించడంతో ఆమె కూడా నవ్వుతూ ఏం లేదని సమాధానం చెప్పింది కానీ, నిజానికి చాలా విషయాలు జరుగుతున్నాయనీ పరోక్షంగా నిశ్చితార్థం గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. అక్టోబర్ 4వ తేదీ వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ నిశ్చితార్థం గురించి రష్మిక కానీ విజయ్ దేవరకొండ గానీ ఎక్కడ అధికారకంగా స్పందించలేదు అలాగే నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయలేదు.
మరోసారి జంటగా విజయ్ దేవరకొండ ,రష్మిక..
వీరి నిశ్చితార్థం గురించి వార్తలు వచ్చిన అనంతరం వీరిద్దరి చేతికి రింగ్స్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగింది నిజమేనని అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ టీం వీరి నిశ్చితార్థం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నిశ్చితార్థం జరిగింది నిజమేనని, 2026 ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతుందని వెల్లడించారు. మరి ఈ నిశ్చితార్థం గురించి విజయ్ దేవరకొండ రష్మిక ఎప్పుడు అధికారకంగా వెల్లడిస్తారో తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట వచ్చేయడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరోసారి వీరిద్దరూ జంటగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: Sukumar -Ramcharan: RC 17 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. మరింత ఆలస్యంగా పుష్ప 3!