Diwali 2025 Movies : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు.. కామెడీ, ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ దీపావళికి థియేటర్ల కళకళలాడతాయని, బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం ఖాయమని ఇటూ ఆడియన్స్, అటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇక దీపావళి సినిమా లైనప్ చూసి అంత కూడా అదే అనుకున్నారు. ఓజీ, కాంతారలు విడుదలై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ దీపావళికి పెద్ద హీరోలు రాకపోయినా.. మినిమమ్ గ్యారంటీ అన్న హీరోలు వచ్చారు. తెలుసు కదాతో సిద్దు జోన్నలగడ్డ, కె–ర్యాంప్ తో కిరణ్ అబ్బవరం, డ్యూడ్తో ప్రదీప్ రంగనాథ్, మిత్రమండలితో ప్రియదర్శి.
గతంలో ఈవీరి నుంచి వచ్చిన చిత్రాలు మంచి టాక్ అందుకున్నాయి. దీంతో ఈ దీపావళి ఈ మీడియం రేంజ్ హీరోలు వస్తుండటంతో బాక్సాఫీసు కళకళలాడుతాయని ఆశగా ఎదురుచూశారు. ఈ దీపావళికి ఈ నాలుగు చిత్రాలు మూవీ లవర్స్ కి డబుల్ సెలబ్రేషన్స్ అందిస్తాయని అనుకున్నారు. కానీ, విడుదల తర్వాత అంచాలాన్ని తారుమారు అయ్యాయి. ఏ సినిమా కూడా ప్రేక్షకులు పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి. మిత్రమండలి ప్రియదర్శి మంచి కామెడీ ఎక్స్పీరియస్ ఇస్తానుకుంటే తీవ్రంగా నిరాశ పరిచాడు. పైగా రోటిన్ కామెడీతో క్రింజ్ తెప్పించాడు. ఇది జోక్ చెప్పి.. మరి జోక్ వేసినట్టుగా ఉందని మిత్రమండలి చూసిన ఆడియన్స్ అంటున్నారు. ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడంతో మినిమమ్ రివ్యూ కూడా అందుకోలేకపోయింది.
ఈ సినిమా 1.25 మించి రేటింగ్ని తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్దూ.. తెలుసు కదా అంటూ వచ్చాడు. లవ్, రొమాంటిక్గా వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. సిద్దూ సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనేది ఆడియన్స్ నమ్మకం. కానీ, ఈ సినిమా సిద్దూ నటన కూడా పెద్దగా ఆకట్టుకోలేదట. దీంతో తెలుసు కదా మిక్స్డ్ టాక్కే పరిమితమైంది. గత చిత్రం జాక్ కంటే పర్వాలేదు అనిపించి.. పర్ఫెక్ట్ దీపావళి సినిమా అని మాత్రం అనిపించుకోలేకపోయింది. ఇక ఇవాళ అక్టోబర్ 12న వచ్చిన కె–ర్యాంప్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఫస్టాఫ్ స్లోగా సాగింది. సెకండాఫ్ మాత్రం పర్వాదు అనిపించుకుంది. ఇలా భిన్నమైన టాక్తో కె ర్యాంప్ డివైడ్ టాక్ అందుకుంటోంది. ఒకవేళ ఈ రోజు తర్వాత ఈ సినిమాకు కాస్తా హిట్ టాక్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ, ఏమవుతుందో చెప్పలేం. దీంతో పర్ఫెక్ట్ దీపావళి మూవీ ఎక్కడ అంటున్నారు మూవీ లవర్స్.
కానీ, దీపాళికి 1000 వాలాల రీసౌండ్ చేస్తుందనుకుంటే సింగిల్ టాపాసు సౌండ్కు మాత్రమే పరిమితమైందనిపిస్తోంది. తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ మూవీ నిన్న విడుదలైంది. దీపావళికి విడుదలైన చిత్రాల్లో ఇది పర్వాలేదు అనిపించింది. ఓపెనింగ్స్ కూడా బాగానే ఇచ్చింది. మన తెలుగు హీరోల కంటే ప్రదీప్ రంగనాథ్ పర్వలేదు అనిపించాడు. లవ్, కామెడీతో రెండున్నర గంటల పాటు ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేశాడట. కాబట్టి.. ఈ దీపావళికి వచ్చిన చిత్రాల్లో డ్యూడ్ మాత్రమే ఒకే ఒకే అన్నట్టు ఉంది. ఈ పండుగకు తెలుగు హీరోల కంటే ప్రదీప్ రంగనాథ్ బెటర్ అంటున్నారు ఆడియన్స్. దీంతో దీపావళికి బాక్సాఫీసు బ్యాక్ టూ బ్యాక్ హట్స్ వెలిగిపోతుందనుకుంటే.. ప్లాప్స్ తో వెలవెలబోతుంది. దీంతో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ దీపావళికి నో ఎంటర్టైన్మెంట్ అంటున్నారు ప్రేక్షకులు.