Ustad Bhagat Singh : కొందరి దర్శకులకు వాళ్ళ కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని హిట్ సినిమాలు ఉంటాయి. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ విషయానికి వస్తే తన కెరీర్ కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఇది ఒక రీమేక్ సినిమా అయినా కూడా హరీష్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం చాలా మందిను ఫిదా చేసింది.
పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా అలా చూపించి బాక్సాఫీస్ వద్ద ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు.
ఒక రీమిక్స్ సినిమాతో రికార్డ్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజి కి సరిపడా పెర్ఫార్మెన్స్, రియల్ క్యారెక్టర్ కి సరిపోయే డైలాగ్స్ ఇవన్నీ కూడా పవర్ ఫుల్ గా హరీష్ శంకర్ ప్లాన్ చేసి ప్రేక్షకులకు అందించాడు. ఆ సినిమా తర్వాత హరీష్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ స్థాయి పేరు మళ్లీ రాలేదు. ఇప్పటికీ కూడా హరీష్ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ మాత్రమే.
గబ్బర్ సింగ్ సినిమా వచ్చి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. ప్రస్తుతం హరీష్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గబ్బర్ సింగ్ మించి ఉంటుంది అని స్టేట్మెంట్లు కూడా కొన్ని హరీష్ పాస్ చేశాడు.
ఇకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. రీసెంట్గా ఈ సంస్థ డ్యూడ్ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ఈవెంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం అప్డేట్ అడిగారు కొంతమంది జర్నలిస్టులు. వాటికి నిర్మాత సమాధానం ఇస్తూ దీపావళికి ఎటువంటి అప్డేట్ లేదు.
కానీ ముందు ముందు చాలా అప్డేట్స్ రానున్నాయి. టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇవన్నీ కూడా త్వరలో వస్తాయి. హరీష్ శంకర్ ఈ సినిమాని బాగా చేస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి చాలా కసిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు హరీష్ అంటూ హైప్ ఇచ్చారు నిర్మాత నవీన్ ఎర్నేని.
వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఫినిష్ చేశాడు. కేవలం హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాను మాత్రమే పెండింగ్ లో పెట్టేశారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించి ఉంటే ముందు ఈ సినిమా విడుదల అయిపోయేది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా మంచి ట్రీట్ అవ్వబోతుంది. ఎందుకంటే స్వతహాగా హరీష్ కూడా అభిమాని కాబట్టి. పవన్ కళ్యాణ్ మీద హరీష్ ఇష్టాన్ని మాటల్లో చెప్పలేము. దువ్వాడ జగన్నాథం సినిమా ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కట్టే కాలే వరకు పవన్ కళ్యాణ్ అభిమాని అని హరీష్ చెప్పిన మాటలు అప్పట్లో వైరల్. గబ్బర్ సింగ్ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.
Also Read: Bigg Boss 9 Promo : కూర పంచాయతీలో ఊహించిన ట్విస్ట్.. మాధురి – దివ్య మధ్యలో నాగ్ లాజిక్