Tom – Ana de: హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు టామ్ క్రూజ్ (Tom Cruise). ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన చేసే యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమాల కోసం ప్రాణం పెట్టేస్తారు. బైక్ స్టంట్ లు, ఫ్లైట్స్ నుంచి దూకేయడం, రియల్ స్టంట్స్ చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా.. మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలు ఈయన యాక్షన్ పర్ఫామెన్స్ కి నిదర్శనంగా నిలుస్తాయి. 67 ఏళ్ల వయసులో కూడా ఆయన చేసే స్టంట్ లు ఒక్కొక్కసారి ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం అని చెప్పవచ్చు.
అలాంటి ఈయన 63 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాను అని.. ఆ పెళ్లి కనివిని ఎరుగని రీతిలో అంతరిక్షంలో చేసుకోబోతున్నాను అంటూ స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ హాలీవుడ్ స్టార్ బ్యూటీ అనా డీ ఆర్మాస్ (Ana de Armas) తో డేటింగ్ లో ఉన్న ఈయన తమ బంధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నామని చెప్పుకొచ్చారు. దీంతో అంతరిక్షంలో పెళ్లి ఎలా ఉంటుందో చూడాలని.. ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూశారు.. కానీ ఇప్పుడు సడన్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం.
also read:K Ramp: మీ తల్లిదండ్రులతో కలిసి ఆ సీన్ చూడగలరా? కిరణ్ అబ్బవరంపై మీడియా మాటల దాడి.!
వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. టామ్ క్రూజ్ వయసు 63 సంవత్సరాలు.. అనా డి ఆర్మాస్ వయసు 37 సంవత్సరాలు.. ఇద్దరు డేటింగ్ లో మంచి సమయాన్ని గడిపారు. ఆ రిలేషన్ ని ముందుకు సాగించాలి అనుకున్నారు. అయితే అప్పుడే వారి మధ్య ఇష్టం తగ్గిపోయింది . దీంతో ఈ బంధం ఎక్కువ కాలం ఉండదని గ్రహించిన టామ్ , అనా డీ స్నేహితులుగా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతరిక్షంలో పెళ్లి అన్నారు? ఇప్పుడు ఈ బ్రేకప్ ఏంటి? 9 నెలలకే అనా డి నీకు బోర్ కొట్టేసిందా టామ్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇకపోతే బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ భవిష్యత్తులో రాబోయే సినిమాల కోసం ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారట. అందులో భాగంగానే ఇప్పటికే టామ్ క్రూజ్ నటిస్తున్న తదుపరి చిత్రంలో అనా డి ఆర్మాస్ నటిగా ఎంపికైనట్లు సమాచారం.
టామ్ క్రూజ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. గతంలోనే ఈయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి.. మొదట మిమి రోజర్స్ ను వివాహం చేసుకున్న ఈయన విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నికోల్ కిడ్ మన్, కేటీ హోమ్స్ లను వివాహం చేసుకున్నారు. అయితే అందరికి కూడా విడాకులు ఇవ్వడం గమనార్హం. పైగా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
టామ్ క్రూజ్ వివాహం చేసుకోబోయే అనా డి ఆర్మాస్ విషయానికి వస్తే.. గతంలో ఈమె మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్టర్ ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్ తో ప్రేమాయణం నడిపింది. ఇతడు క్యూబా అధ్యక్షుడు కుమారుడు కూడా. ఇప్పుడు తనకంటే రెట్టింపు వయసు ఉన్న టామ్ క్రూజ్ తో పెళ్లికి సిద్ధమయ్యింది.