Sukumar -Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan Tej) ఇటీవల గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమాకు (Peddi Movie) కమిట్ అయ్యారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మైత్రి మూవీ నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాని సుకుమార్ (Sukumar)డైరెక్షన్లో చేయబోతున్నట్లు ఇదివరకే అధికారకంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మైత్రి మూవీ నిర్మాతలలో ఒకరైన నవీన్ మాట్లాడుతూ ఒక బిగ్ అప్డేట్ తెలియ చేశారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం డ్యూడ్ బ్లాస్ట్ ఈవెంట్ అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మైత్రి మూవీ నిర్మాత నవీన్ సుకుమార్ రాంచరణ్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలిపారు. రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ సినిమా పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతనే సుకుమార్ పుష్ప 3(Pushpa 3) సినిమా పనులను మొదలు పెడతారు అంటూ ఈయన తెలియజేయడంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పుష్ప 3 చూడాలి అంటే బన్నీ ఫాన్స్ మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందేనని స్పష్టం అవుతుంది.
రంగస్థలం సినిమాకు సీక్వెలా?
ఇక సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా రంగస్థలం సినిమాకు సీక్వెల్ సినిమాగా రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే సుకుమార్ స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సమంత నటించబోతుందని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ చివరిగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ క్రమంలోనే సుకుమార్ రామ్ చరణ్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Samantha : తప్పు చేశా.. నేనేమీ ఫర్‌ఫెక్ట్ కాదంటున్న సమంత