Baahubali Re Release: తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన బాహుబలి మూవీ ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క శెట్టిలు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా మొదటి పార్ట్ ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015లో విడుదలైంది. ఇక రెండో పార్ట్ ‘బాహుబలి: ది కన్క్లూజన్’ 2017లో విడుదలైంది. ఈ రెండు భాగాలు కూడా ఒకదానిమించి ఒకటి హిట్ అయ్యింది.
బాక్సాఫీసు వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ చేసిన తొలి తెలుగు చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి: ది ఎపిక్ పేరుతో రెండు భాగాలను కలిపి సుమారు నాలుగు గంటల నిడివితో రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త విక్రం నారాయణ ఎప్పుడో చెప్పారు. బాహుబలి రీ రిలీజ్పై ఆయన ఏడేళ్ల క్రితమే జోస్యం చెప్పారు. 2017లో బాహుబలి పార్ట్ 2 రిలీజ్ సమయంలో ఆయన చేసిన ట్వీట్ చేశారు.
“రాజమౌళి గారికి, బాహుబలి పార్ట్ 1, 2లను కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చేయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం అవుతుంది. ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా రూ. 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని అందించండి” అంటూ తన ట్వీట్ రాసుకొచ్చారు విక్రం నారాయణ. 2017లో ఆయన రెండు భాగాలు కలిపి రీలీజ్ చేయండని చెప్పడం, ఇప్పుడు రీ రిలీజ్ ని జక్కన్న అలాగే ప్లాన్ చేయడంతో ఆయన పాత ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది. ఆయన ఐడియాను ఇప్పుడు జక్కన్న ఫాలో అవుతున్నాడా?, ఎనిమిదేళ్ల క్రితమే బాహుబలి రీలీజ్ని ప్లాన్ చేశారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Pavala Shyamala: ప్రముఖ నటి దీనస్థితి.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పావల శ్యామల