Ponnambalam: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా సినిమాలలో విలన్ పాత్రలలో నటించి మెప్పించిన వారిలో పొన్నాంబలం(Ponnambalam) ఒకరు. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించే ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. తెలుగులో ఘరానా మొగుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నాంబలం ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించి మెప్పించారు. ఈయన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో సుమారు 1500 లకు పైగా సినిమాలలో నటించారని తెలుస్తుంది.
అండగా నిలిచిన చిరంజీవి..
ఇలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉండటానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి. కిడ్నీ వ్యాధి (Kidney Disease)సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గత కొద్ది రజుల క్రితం ఈయన ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయడంతో మెగాస్టార్ చిరంజీవి తన (Chiranjeevi)కోడలు ఉపాసన(Upasana) సహాయంతో అపోలో హాస్పిటల్లో ఈయనకు సరైన వైద్య చికిత్సలు చేయించారు. ఈ విషయాన్ని స్వయంగా నటుడు పొన్నాంబలం తెలియజేశారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నటుడు…
ఇకపోతే తాజాగా ఈయన మరోసారి తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడటమే కాకుండా జీవితంలో నేను చేసిన తప్పు, పొరపాట్లు ఎవరు చేయొద్దు అంటూ అందరికీ సలహాలు కూడా ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి చికిత్స తీసుకుంటున్నానని ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 750 కి పైగా ఇంజక్షన్లు తీసుకున్నాను అంటూ తన బాధను మొత్తం బయటపెట్టారు. రెండు రోజులకు ఒకసారి నా శరీరం నుంచి రెండు ఇంజక్షన్ల రక్తం తీసి డయాలసిస్ చేసేవారని ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించానని తెలిపారు. నేను పడిన ఈ బాధలు పగవాళ్లకు కూడా రాకూడదని ఈయన కోరుకున్నారు.
మద్యం సేవించడమే కారణం…
ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ తాను క్రమక్రమంగా కోలుకుంటున్నానని ఈయన తెలియచేశారు. అయితే నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నాకున్న చెడు అలవాట్లే కారణమని తెలిపారు. ఒకానొక సమయంలో మధ్యానికి బానిసగా మారి పెద్ద ఎత్తున మద్యం సేవించడం వల్ల తనకు ఇలాంటి సమస్య వచ్చిందని నేను చేసిన ఈ తప్పు ఎవరు చేయొద్దు అంటూ ఈయన అభిమానులకు సూచనలు చేశారు. అయితే కొంతకాలం నుంచి మందు మానుకున్నానని అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిందని పొన్నాంబలం తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరోగ్య విషయంలో ఈయన చేసిన తప్పులు గురించి తెలియజేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఒకానొక సమయంలో చికిత్సకు డబ్బులు లేని సందర్భంలో కోలీవుడ్ సెలబ్రిటీలైన రాధిక, ధనుష్, చిరంజీవి వంటి సెలబ్రిటీలు ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ఇక ఈయన తెలుగులో కూడా స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
Also Read: HHVM: వీరమల్లు కలెక్షన్స్ అందుకే బయట పెట్టలేదా.. ఇంత పెద్ద కారణం ఉందా?