BigTV English

Glen Maxwell : ఓపెనర్ గా మ్యాక్స్ వెల్.. ఇక సంచలనమే..!

Glen Maxwell : ఓపెనర్ గా మ్యాక్స్ వెల్.. ఇక సంచలనమే..!

Glen Maxwell : టీ-20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టుతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక  ఈ ప్రయోగాల్లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్ లో విధ్వంసకర బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ను ఓపెనర్ గా పంపారు. ఓపెనర్ గా అవకాశం అందుకున్న మ్యాక్స్ వెల్ పవర్ ప్లే లో దుమ్ము రేపి సంచలనం రేపాడు. సెయింట్ కిట్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. 206 పరుగులు కఠినమైన లక్ష్యాన్ని ఛేదించడానికి ఆస్ట్రేలియా తరుపున గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్ ఓపెనర్లుగా వచ్చారు. ఇన్నింగ్స్  ప్రారంభించిన ఆస్ట్రేలియా తరపున మ్యాక్స్ వెల్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసాడు.


Also Read :  IND Vs ENG : రికార్డు సృష్టించిన రాహుల్-గిల్.. ప్రపంచంలోనే తొలి జోడీగా..!

ఆస్ట్రేలియా అదుర్స్


ఫస్ట్ ఓవర్ నుంచే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. 6 భారీ సిక్సర్లు, 1 ఫోర్ తో సహా 18 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో గత రెండు మ్యాచ్ ల్లో మాదిరిగానే నాలుగో టీ-20లో కూడా ఓపెనింగ్ చేశాడు. ఈ సారి అతను గత రెండు సార్ల మాదిరిగా ఫెయిల్ కాలేదు. క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే వెస్టిండీస్ పై తన పని ప్రారంభించాడు. ఫలితంగా వెస్టిండీస్ ఇచ్చిన టార్గెట్ వేగంగా తగ్గుముఖం పట్టింది. పవర్ ప్లే లో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగులు సాధించింది. ఇక ఆ తరువాత జోష్ ఇంగ్లీష్ 51 పరుగులు చేయగా.. కామెరూన్ గ్రీన్ 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇలా ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 206 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ జట్టు వెస్టిండీస్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో 4-0 ఆధిక్యంలో నిలిచింది.

ఓపెనింగ్ లో స్ట్రైక్ రేట్ అదుర్స్..

ఇక ఓపెనింగ్ చేసిన మ్యాక్స్ వెల్ నాలుగో టీ-20లో 18 బంతుల్లో 47 పరుగులు.. 261.11 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. ఇందులో 6 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. వెస్టిండీస్ తో టీ-20 సిరీస్ లో ఓపెనర్ గా గ్లెన్ మ్యాక్స్ వెల్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఈ స్కోర్ తో టీ-20 సిరీస్ లో ఓపెనర్ గా ఆడిన 3 మ్యాచ్ ల్లో ఇప్పటి వరకు అతను 35 బంతుల్లో 8 సిక్సర్లతో సాయంతో 79 పరుగులు చేశాడు. వెస్టిండీస్ తో జరిగిన టీ-20 సిరీస్ లో 4 మ్యాచ్ ల్లో మ్యాక్స్ వెల్ 45 బంతుల్లో 90 పరుగులు చరేశఆడు. సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో అతను ఓపెనర్ గా ఆడలేదు. అందులో 10 బంతుల్లో 11 పరుగులు చేశాడు. టీ-20 అంతర్జాతీయ కెరీర్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇప్పటివరకు 6 మ్యాచ్ ల్లో ఓపెనింగ్ చేసేశాడు. వాటిలో 298 పరుగులు చేసాడు. అతని అత్యధిక స్కోర్ 145 పరుగులు కావడం విశేషం. ఇలాగే ఫామ్ కొనసాగితే.. వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ ఓపెనింగ్ చేసి రెచ్చిపోతాడంటూ అభిమానులు పేర్కొంటున్నారు.

Tags

Related News

Danish Kaneria: సొంత జ‌ట్టుకే కౌంట‌ర్ ఇచ్చిన పాక్ ప్లేయ‌ర్‌.. టీవీల‌కు ఇనుప కంచెలు వేసి !

Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే

Mohsin Naqvi: ట్రోఫీతో పరారైన పాకిస్థాన్ చీఫ్ న‌ఖ్వీ….బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

Asia Cup 2025 Prize Money : టీమిండియాకు రూ.200 కోట్లకు పైగా ప్రైజ్ మనీ… బీసీసీఐ ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..?

Abrar Ahmed-Sanju Samson: అబ్రార్ కు ఇచ్చిప‌డేసిన‌ టీమిండియా ప్లేయ‌ర్లు..సంజూ ముందు ఓవ‌రాక్ష‌న్ చేస్తే అంతేగా

IND Vs PAK : టీమిండియాను ఓడించేందుకు పాక్ కుట్రలు… గాయమైనట్లు నాటకాలు ఆడి.. అచ్చం రిషబ్ పంత్ నే దించేశాడుగా

Salman Ali Agha cheque: పాక్ కెప్టెన్ స‌ల్మాన్ బ‌లుపు చూడండి…ర‌న్న‌ర‌ప్ చెక్ నేల‌కేసికొట్టాడు

Big Stories

×