HHVM Collections: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu)ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమాకు పలు ప్రాంతాలలో మంచి ఆదరణ లభిస్తుండగా, కొన్నిచోట్ల కాస్త నిరాశ ఎదురవుతుందని చెప్పాలి. ఇలా మొదటి నాలుగు రోజులు పాటు థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఈ సినిమా ఇప్పటివరకు ఎంత కలెక్షన్లను రాబట్టిందనే విషయం గురించి చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత ప్రతిరోజు కలెక్షన్ల గురించి అధికారక పోస్టర్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు.
బలమైన కారణం ఉంది..
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం ఇలా జరగకపోవడంతో అభిమానులు కూడా ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం థియేటర్ విజిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ జ్యోతి కృష్ణ(Jyothi Krishna)కు వీరమల్లు కలెక్షన్ల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ మా సినిమా ఇప్పటివరకు రాబట్టిన కలెక్షన్ల గురించి అధికారకంగా ప్రకటన చేయకపోవడానికి బలమైన కారణం ఉందని తెలియజేశారు.
కలెక్షన్లు గురించి చెప్పిన నమ్మరా?
ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్లకు(Collections) సంబంధించి బయట ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మనం కూడా ఎంతో నిజాయితీగా నిజమైన కలెక్షన్ల గురించి అధికారకంగా వెల్లడించినా, అది నిజమా? కాదా? అని చాలామంది చర్చలు జరుపుతారు.కొన్ని వెబ్‌సైట్లు కూడా రాస్తుంటాయి. అందుకే ఒకప్పటిలాగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది అని పోస్టర్ల ద్వారా తెలియజేస్తున్నామని త్వరలోనే ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి ప్రకటన రావచ్చని డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా వీరమల్లు సినిమా నార్త్‌లోనూ తెలుగు వెర్షన్ విడుదలైందని, హిందీలో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
సినిమా నుంచి తప్పుకున్న క్రిష్…
ఇలా ఈ సినిమా కలెక్షన్ల గురించి జ్యోతి కృష్ణ క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించగా కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు జ్యోతి కృష్ణ తండ్రి ఏ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గత మూడు సంవత్సరాలు పాటు షూటింగ్ పనులను జరుపుకుంటూ ఎన్నో అవాంతరాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిస్టారికల్ పిరియాడిక్ సినిమాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ (Nidhi Agerwal)నటించి సందడి చేశారు.