Nobel Prize Physics: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల పేర్లు నోబెల్ బృందం ప్రకటిస్తుంది. నిన్న వైద్య రంగంలో ముగ్గురు పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 2025 ఏడాదికి గానూ భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. జాన్ క్లర్క్, మిచెల్ హెచ్. డెవోరెట్, జాన్ ఎం. మార్టినిస్ లకు నోబెల్ పురస్కారం దక్కినట్టు స్వీడన్ లోని స్టాక్ హోంలో నోబెల్ బృందం ప్రకటించింది. వారి విప్లవాత్మక ఆవిష్కరణ ‘ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్’ అనే అంశానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్టు నోబెల్ బృందం వివరించింది.
విజేతల పేర్ల ప్రకటన ప్రక్రియ అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. ఇప్పటికే వైద్య రంగం, భౌతిక శాస్త్రం విభాగాల్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ల పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత సాహిత్యం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి తదితర విభాగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లను ప్రకటించనున్నారు. ఈ నెల 13 వరకు అన్ని రంగాలల్లో నోబెల్ బహుమతి వరించిన వారి పేర్లను ప్రకటించనున్నారు.
ALSO READ: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. వారి పేర్లు ఇవే..