E-Paper
Advertisement

Sheikh Hasina: హసీనాకు కోర్టు ఉరి శిక్ష.. భారత విదేశాంగ శాఖ ఏమందంటే..?

Sheikh Hasina: హసీనాకు కోర్టు ఉరి శిక్ష.. భారత విదేశాంగ శాఖ ఏమందంటే..?
Advertisement

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ బంగ్లాదేశ్ నేరాల ట్రైబ్యునల్ (IBCT) మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. హసీనాపై వచ్చిన మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల ఆరోపణలకు సంబంధించి ట్రైబ్యునల్ తీర్పును తాము గమనించామని ఒక అధికారిక ప్రకటనలో భారత్ పేర్కొంది. దగ్గరి పొరుగు దేశంగా.. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, సమగ్రత స్థిరత్వం సహా ఆ దేశ ప్రజల ఉత్తమ ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ లక్ష్యంతో సంబంధిత వర్గాలన్నింటితో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని తెలిపింది.

మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ IBCT ఈ తీర్పును వెలువరించింది. ఆగస్టు 2024లో పదవి కోల్పోయినప్పటి నుండి షేక్ హసీనా భారతదేశ రాజధాని ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమెను తమకు అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్‌లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఇరు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ తమకు సహకరించాలని కోరింది.

Advertisement

అయితే.. ఈ కీలక పరిణామంపై భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన తటస్థ వైఖరిని స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ తీర్పును గమనించినట్లు చెప్పడం ద్వారా భారత్ ఆ తీర్పును పూర్తిగా ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా అప్రమత్తంగా వ్యవహరించింది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలపై తక్షణం ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా.. ఆ దేశ ప్రజల శ్రేయస్సు, ముఖ్యంగా ప్రజాస్వామ్యం, స్థిరత్వంపై తమకున్న నిబద్ధతను మాత్రమే పునరుద్ఘాటించింది.

దగ్గరి పొరుగు దేశంగా, భారతదేశం బంగ్లాదేశ్ ప్రజల ఉత్తమ ప్రయోజనాలకు కట్టుబడి ఉంది. అందులో శాంతి, ప్రజాస్వామ్యం, సమగ్రత,  స్థిరత్వం ఉన్నాయి. ఈ లక్ష్యంతో మేము ఎల్లప్పుడూ అందరితో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన ద్వారా.. భారత్ బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపై నిశితంగా దృష్టి సారిస్తున్నట్లు, కానీ షేక్ హసీనా అప్పగింత వంటి సున్నితమైన అంశంపై మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి నిర్దిష్ట హామీ ఇవ్వడానికి సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. షేక్ హసీనా ఈ తీర్పును ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. ఆమె అప్పగింత విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

Advertisement

ALSO READ: Vitamin D Deficiency: విటమిన్ డి లోపం.. ప్రారంభంలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు !

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×