BigTV English

Actor Vasista : 50 రూపాయల కోసం ఆ పని.. కన్నీళ్లు తెప్పిస్తున్న యాక్టర్ వశిష్ఠ రియల్ లైఫ్..

Actor Vasista : 50 రూపాయల కోసం ఆ పని.. కన్నీళ్లు తెప్పిస్తున్న యాక్టర్ వశిష్ఠ రియల్ లైఫ్..

Actor Vasista : కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న స్టార్ నటుడు వశిష్ట సింహ.. తెలుగు ప్రేక్షకులు కూడా ఈయన సుపరిచితమే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. కేజీఎఫ్, ఓదెల, ఓదెల 2 సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన సినిమా త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, సత్యం రాజేష్, సాంచీ రాయ్ సైతం ముఖ్య పాత్రలు పోషించారు.. ఇటీవలే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ముందుగా అనుకున్న దాని కంటే మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి . ఇదిలా ఉండగా తాజాగా వశిష్ట ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవడంతో ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది..? ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయాల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


50 రూపాయల కోసం ఆ పని చేశాను.. ఎమోషనల్ స్టోరీ..

ప్రముఖ కన్నడ నటుడు వశిష్ట తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నటుడిగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను అని అన్నారు. ఒక సందర్భంలో 50 రూపాయల కోసం రోడ్లమీద పాంప్లెట్లు పంచాను అని ఆయన అన్నారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి నటన మీద ఆసక్తితో ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పారు. ఎవరైనా కష్టపడితే ఫలితం ఉంటుంది అని ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇంత గొప్ప నటుడు అయ్యుండి కూడా అలాంటి జీవితాన్ని అనుభవించి వచ్చారా అని ఆయన అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


త్రిబాణధారి బార్బరిక్ పై సంచలన వ్యాఖ్యలు..

డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా నటుడు వశిష్ట సినిమా గురించి కీలక విషయాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. ఈ మూవీ స్టోరీకథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతీ పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నేను నెగెటివ్ రోల్స్ పోషించాను. కానీ ఇందులో నా కారెక్టర్ సరికొత్తగా ఉంటుంది. ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని ఆయన అన్నారు.

Also Read: మొన్న ఎవడ్రా.. ఇప్పుడేమో ఇలా.. మనకేంటిరా ఈ ఖర్మ..

వశిష్ఠ నటించిన సినిమాలు..

నటుడు వశిష్ఠ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ నటుడు. ఓదెల రైల్వేస్టేషన్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు. కేజీఎఫ్ మూవీ ఇతని లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ప్రస్తుతం ఓ రెండు మూడు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు వశిష్ట చెప్పారు. త్వరలోనే ఆ మూవీలను అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే హీరోయిన్ హరిప్రియను వివాహం ఆడారు. ఇటీవలే వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు.

Related News

Shilpa Shetty: తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పాశెట్టి .. అదే కారణమా..?

Kotha Lokah : అనుష్క, కీర్తి సురేష్‌ను దాటేసిన కళ్యాణీ ప్రియదర్శణ్… ఒక్క సినిమాతో నెంబర్ ప్లేస్..

KishkindhaPuri Trailer: దెయ్యంలా మారిన అనుపమ… థియేటర్‌లో మరి భయపడుతారా ?

Emraan Hashmi: ఓమీ.. టాలీవుడ్ లో బాగా వినిపించే పేరు అవుతుంది

Soubin Shahir: కూలీ నటుడికి హై కోర్టు బిగ్ షాక్… విదేశాలకు వెళ్లడానికి నో పర్మిషన్..

Pookie: ఛీఛీ.. ఇదెక్కడి దిక్కుమాలిన టైటిల్ రా.. కొంచెం కూడా సిగ్గు లేదా.. విజయ్ ఆంటోనీ

Big Stories

×