Air India Offers: ఎయిరిండియా ప్రయాణికులకు బంపరాఫర్ ఇచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారికి ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. అంతేకాకుండా అదనపు లగేజ్ అలవెన్స్, డేట్ మార్పుల సదుపాయం లాంటి అందులో పొందుపరిచింది.
తమ విమానాల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఎయిరిండియా ఆఫర్ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు టికెట్ ధరపై రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. దేశీయ- అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ మూల ధరపై 10 శాతం వరకు, దేశీయ సర్వీసుల్లో 25శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఎకనామీ, బిజినెస్ క్లాస్ సహా అన్నిరకాల టికెట్లపై ఈ రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఎయిరిండియా విమానంలో టికెట్లపై రాయితీ పొందాలంటే ఆ సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుకింగ్ చేయాలి. కన్‌సెషన్ టైప్ దగ్గర సీనియర్ సిటిజన్ కోటాను ఎంపిక చేసుకోవాలి. రాయితీతోపాటు సాధారణం కంటే 10 కిలోల వరకు అదనపు లగేజీని సీనియర్ సిటిజన్లు తీసుకెళ్లే అవకాశం కల్పిస్తుంది. సీనియర్ సిటిజన్లు తమ ప్రయాణ తేదీని ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
మార్పు చేసుకున్న ప్రయాణ తేదీలో టికెట్ ధర అధికంగా ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ప్రజలు వారి గుర్తింపు కార్డు ఆధారంగా వయస్సు నమోదు చేయాలి. ఓటరు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులను మాత్రమే అనుమతిస్తారు.
ALSO READ: జొమాటో కీలక నిర్ణయం.. బాదుడు మొదలు
ప్రయాణీకులు టికెట్ తీసుకునే సమయంలో చెక్-ఇన్ సమయంలో, బోర్డింగ్ సమయంలో తమ ఐడీని చూపించాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణాల్లో ప్రత్యేక ఆఫర్లు ఇచ్చింది ఎయిరిండియా. బేస్ ఫేర్‌పై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. UPI ద్వారా పేమెంట్ చేసేవారికి రూ.200 అదనపు తగ్గింపు (UPIPROMO కోడ్ వాడాలి) ఉంటుంది.
అలాగే బ్యాగేజ్ అలవెన్స్ 15 కిలోలు, డేట్ ఛేంజ్, క్యాన్సిలేషన్ నిబంధనలు ఉన్నాయి. మూడు రోజుల ముందు డేట్ మార్చుకుంటే ఉచితం. 3 రోజులకు ముందుగా క్యాన్సిల్ చేస్తే రూ.2,000 వసూలు చేస్తారు. పైన పేర్కొన్న రాయితీలకు విమాన మార్పులు, రద్దులు లేదా వాపసులకు వర్తించే ప్రామాణిక రుసుములను కంపెనీ వసూలు చేస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఇక లగేజ్ అలవెన్స్ క్లాస్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఎకానమీ క్లాస్ అయితే 10 కిలోల అదనపు లగేజ్ (మాక్స్ 40 కిలోల వరకు) లేదా 2 బ్యాగ్స్ (ప్రతి ఒక్కటి 23 కిలోల వరకు) ఉండవచ్చు. ప్రీమియం ఎకానమీ కూడా అంతే. బిజినెస్ క్లాస్ అయితే 32 కిలోల వరకు రెండు బ్యాగులను తీసుకెళ్లవచ్చు. అయితే బుకింగ్ సమయంలో UPIPROMO అనే ప్రోమో కోడ్ వాడితే రూ.2,000 వరకు అదనంగా తగ్గింపు పొందొచ్చు. ఇది కూడా UPI పేమెంట్ చేసినవారికే వర్తిస్తుంది.