BigTV English

Bigg Boss Agnipariksha : మొన్న ఎవడ్రా.. ఇప్పుడేమో ఇలా.. మనకేంటిరా ఈ ఖర్మ..

Bigg Boss Agnipariksha : మొన్న ఎవడ్రా.. ఇప్పుడేమో ఇలా.. మనకేంటిరా ఈ ఖర్మ..

Bigg Boss Agnipariksha : తెలుగు బుల్లితెరపై టాప్ రియాల్టీ షో అంటే బిగ్ బాస్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎనిమిది సీజన్లో పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో తొమ్మిదో సీజన్లో మొదలుపెట్టబోతుంది. ఈ ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన డైలాగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే సామాన్యుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇండస్ట్రీలోని వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు కు ముందుగానే టాస్కుల గురించి వివరించేందుకు అగ్ని పరీక్ష అనే షోని ప్రారంభించారు. ఆ సోలో కంటెస్టెంట్ గా వచ్చిన వరంగల్ అమ్మాయి అనూష రత్నం అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బిగ్ బాస్ గురించి ఈమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.


మొన్న అలా.. నేడు ఇలా..

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అందరి దృష్టిని ఆకర్షించింది వరంగల్ పోరి అనూష రత్నం.. ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా పని చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో టాస్కులతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు తనకి ఓట్లు వెయ్యాలని అడిగింది. నేను ఎన్నో కష్టాలను అనుభవించాను.. ఉద్యోగం చేశా, ట్యూషన్‌ టీచర్‌గా చేశా.. కంటెంట్‌ క్రియేటర్‌గానూ పని చేశాను.. మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఉన్నాను. నా గొంతు ప్రతి ఒక్క ఇంట్లో వినిపించాలంటే కచ్చితంగా నన్ను మీరందరూ కలిసి ఓట్లు వేసి బిగ్ బాస్ లోకి పంపించాలని రిక్వెస్ట్ చేసింది. ఆ వీడియోని టాక్ చేస్తూ గతంలో ఈమె ఎవడ్రా బిగ్ బాస్ అంటూ అన్న వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు నెటిజన్లు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీనిపై వివరణ ఇచ్చింది..


Also Read :  అల్లు అర్జున్ ను పవన్ కాపీ కొడుతున్నాడా..? ఇదిగో ప్రూఫ్..

క్లారిటీ ఇచ్చిన అనూష.. 

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అనూష రత్నం.. అప్పుడేమో ఎవడ్రా బిగ్ బాస్ అన్నావ్ ఇప్పుడు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్తున్నామని అందులో యాంకర్ ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానం చెప్పింది. నేను తప్పుడు ఉద్దేశంతో అయితే ఆ మాట అనలేదు. ఎవడ్రా బిగ్ బాస్ అని మామూలుగానే అన్నాను. దాన్ని ట్యాగ్ చేసి మరీ నన్ను ఆడుకుంటున్నారు నేను తప్పుగా అనలేదు ఇది గుర్తుపెట్టుకోండి అని అనూష అన్నారు. ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ లోకి వెళ్లడానికి మళ్లీ మాట మార్చావా అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై అనూష మరోసారి స్పందిస్తుందేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఐదు మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి పంపనున్నట్లు సమాచారం.. మొత్తానికి 16 మందితో ఈసారి బిగ్ బాస్ మొదలు కాబోతుందని తెలుస్తుంది.. సెప్టెంబర్ 7న బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుందని అనౌన్స్ చేశారు.. ఈసారి సీజన్ ఎలాంటి రచ్చలతో ముగుస్తుందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Bigg Boss 9 telugu: హమ్మయ్య.. ఎట్టకేలకు ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది!

Bigg Boss AgniPariksha: కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన అగ్నిపరీక్ష!

Bigg Boss AgniPariksha: చివరిదశకు చేరుకుంటున్న అగ్నిపరీక్ష.. మరీ ఇంతలా ఉన్నారేంటి?

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ను ఇబ్బంది పెట్టేది అందుకేనా..?

Keerthi bhat: బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు..వారివల్ల అయినవాళ్ళు కూడా దూరం!

Big Stories

×