K – Ramp Trailer : షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నాడు కిరణ్. ఆ తర్వాత చేసిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఆ సినిమాతో తనలోని రైటర్ కూడా బయటకు వచ్చాడు. అక్కడితో వరుసగా అవకాశాలు వచ్చాయి. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత క సినిమాతో కం బ్యాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కే రాంప్ సినిమాకి సంబంధించిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ సినిమాకి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రైలర్ చూస్తేనే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అని అర్థమయిపోతుంది. రీసెంట్ టైమ్స్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా సక్సెస్ సాధిస్తున్నాయి. ఇకపోతే ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొన్ని డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. నా పేరు ‘అబ్బవరం’… ఇస్తా ‘వరం’ అంటూ నా వెంట పడుతున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయ్యే మీమ్స్ ను విపరీతంగా ఈ సినిమాలో వాడారు. అలానే చాలావరకు బూతులను కూడా మింగేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో కిరణ్ పేరు కుమార్.
ఎంటర్టైన్మెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ఈ సినిమాలో బానే డిజైన్ చేశారు అని ట్రైలర్ చూస్తే అర్థమయిపోతుంది. మరోవైపు హీరోయిన్ తో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. సీనియర్ నరేష్ క్యారెక్టర్ ఈ సినిమాలో మంచి ఫన్ క్రియేట్ చేయబోతుంది అని అర్థమవుతుంది. వెన్నెల కిషోర్, సాయికుమార్ వంటి నటులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించునున్నారు. ఈ సినిమా ఒక కంప్లీట్ కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో జరగబోతున్నట్లు అర్థమవుతుంది. ఎక్కువ శాతం కేరళలో షూటింగ్ చేసింది చిత్ర యూనిట్.
Also Read: Trivikram Srinivas : పని అయిపోయింది పడిపోయాడు అనుకున్నారు, కానీ కెరటంలా పైకి లేచాడు
ప్రేక్షకులు వినోదానికి విపరీతంగా అలవాటు పడిపోయారు. సినిమా థియేటర్లో కూర్చున్నా కూడా కొంచెం బోర్ కొడితే.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటారు. అంటే ఒక సినిమా కూడా ప్రతిక్షణం వినోదపరచాలి, లేదంటే భావోద్వేగానికి గురిచేయాలి. ఆ స్థాయిలో ఉంటే గాని సినిమాను ప్రేక్షకుడు ప్రస్తుత రోజుల్లో చూడలేని పరిస్థితి. అందుకే ఎక్కువ శాతం మంది ఎంటర్టైన్మెంట్ ను నమ్ముకుంటున్నారు. ఈ ట్రైలర్ బట్టి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుంది అని అర్థమవుతుంది.