Train Timings: దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. మారిన సమయాలు అక్టోబర్ 11, 15 తేదీల నుంచి అమలులోకి రానున్నాయి. బోధన్-కాచిగూడ ప్యాసింజర్ రైలు నంబర్ 57414.. ఉదయం 11:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. కాచిగూడ-గుంతకల్ ప్యాసింజర్(రైలు నెంబర్ 57412) ఉదయం 11:45 గంటలకు కాచిగూడ నుండి తిరిగి బయలుదేరుతుంది.
కర్నూలు టౌన్-నంద్యాల ప్యాసింజర్(రైలు నంబర్ 77209), హజ్రత్ నిజాముద్దీన్-కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్ 12648), ఔరంగాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్ 17254) సమయాల్లో మార్పులు జరిగాయి. అయితే మార్గమధ్యలో స్టేషన్లలో సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు మారిన సమయాలను పరిశీలించాలని అధికారులు కోరారు.
డోర్నకల్-పాపటపల్లి రైలు మార్గంలో మూడో లైన్ మరమ్మతులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఈ మార్గంలో నడిచే 32 రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మారిన టైమింగ్స్ అక్టోబర్ 11 నుంచి 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
విశాఖపట్నం-న్యూ ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్, డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లను రద్దు అయ్యాయి. దీంతో పలు ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు.
ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతుంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా నడవనుంది.
సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 20629)లో కోచ్ మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Also Read: Passenger Alert: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్‌లో వెళ్లే రైళ్లన్నీ రద్దు, ముందుగా చెక్ చేసుకోండి
శబరి ఎక్స్ ప్రెస్ లోని ఫస్ట్ ఏసీ కోచ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాని స్థానంలో మరో సెకండ్ ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.