Sand Mafia: ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గుంటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లంక భూముల్లో ఇసుక తవ్వకాలు చేయడం గమనించిన స్థానికులు.. టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి శ్రీనివాసరావు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తనపై దాడి చేసింది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుడు కంచేటి సాయి అని ఆరోపించాడు. ఇసుక దందాను అడ్డుకుంటున్నందుకు తనపై దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.