E-Paper
Advertisement

Actress Sudeepa: కొడుకుని పరిచయం చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్‘ చైల్డ్ ఆర్టిస్ట్ పింకి

Actress Sudeepa: కొడుకుని పరిచయం చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్‘ చైల్డ్ ఆర్టిస్ట్ పింకి
Advertisement

Sudeepa Introduced Her Son: నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో విక్టరి వెంకటేష్, ఆర్తి అగర్వాల్ ఎంత పాపలరో.. అందులోని చైల్డ్ ఆర్టిస్టు కూడా అంతే ఫేమస్. వెంకీ వెంకీ అంటూ వెంకటేషన్ కి పంచ్ లు వేస్తూ ఆకట్టుకుంది నటి సుదీప. ఇందులో ఆమె నటన ప్రేక్షకులు మదిలోని నిలిచిపోయింది. నువ్వు నాకు నాచ్చవ్ అనేగానే అంత పింకీనే గుర్తు చేసుకుంటారు. అంతగా అలరించిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

నువ్వు నాకు నచ్చావ్ తో లైమ్ లైట్లోకి

Advertisement

చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమా అలరించిన సుదీప్.. ప్రతిఘటన అనే సీరియల్ తో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత సుదీప మరే సినిమాలో, సీరియల్లో నటించలేదు. అదే సమయంలో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సుదీప్ ఇటీవల తల్లి ప్రమోషన్ పొందింది. కొన్నిరోజుల కిందట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన శుభవార్తను ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నప్పటికి బిడ్డను చూపించి అందరికి సర్ప్రైజ్ చేసింది.

కొడుకు బారసాల వీడియో

తాజాగా కొడుకు బారసాల ఫంక్షన్ ఘనంగా నిర్వహించిన ఆమె ఈ సందర్భంగా కొడుకుని పరిచయం చేస్తూ వీడియో షేర్ చేసింది. ‘మై లిటిల్ కింగ్ ని మీకు చూపించడం చాలా సంతోషంగా ఉంది‘ బారసాల వీడియోతో పాటు తన బేబీ షవర్ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇందులో భర్తతో కలిసి కొడుకుని ముద్దాడుతూ సంతోషంలో మునిగితేలుతుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన సుదీప ఇప్పుడు ఓ బిడ్డకు తల్లవ్వడం చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సుదీప.. 1994లో ధర్మారు ఏం.ఏ చిత్రంతో బాలనటిగా వెండితెర ఆరంగేట్రం చేసింది. తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.

Advertisement

Also Read: Prabhas New Movie : ప్రేమ్ రక్షిత్‌తో ప్రభాస్ మూవీలో బిగ్ ట్విస్ట్… కనిపించడు.. జస్ట్ వినిపిస్తాడు అంతే

బిగ్ బాస్ 6 సీజన్ లో సందడి

అయితే వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ మూవీతోనే సుదీప్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో పింకీ పాత్రలలో ఎంతో మంది ప్రేక్షకుల హ్రదయాలను గెలుచుకుంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ లోనూ పాల్గొంది. షోలో ఉన్నప్పుడు తనకు గర్భ్ స్రావం అయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. 2015లో తాను తొలిసారి గర్భం దాల్చానని, కానీ, థైరాయిడ్ ఇతర అరోగ్య సమస్యల వల్ల గర్భస్రావంతో బిడ్డకు కొల్పోయానని కన్నీరు పెట్టుకున్న సుదీప తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×