Rukmini Vasanth: రుక్మిణి వసంత్(Rukmini Vasanth) సౌత్ సినీ ఇండస్ట్రీలో బాగా మారుమోగుతున్న పేరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల శివ కార్తికేయన్ తో కలిసి మదరాసి సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక తాజాగా రిషబ్ శెట్టి(Rishabh Shetty) హీరోగా కాంతార చాప్టర్ 1 (Kantara Chapter1)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో రుక్మిణి వసంత్ సైతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు . ఈ నేపథ్యంలోనే ఈమె అభిమానులు తనకు ఎంతో ముద్దుగా క్రష్ అనే ట్యాగ్ జోడించి పిలుస్తున్నారు.. ఇలా తనని అభిమానులు క్రష్ అని పిలవడం పట్ల రుక్మిణి వసంత్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె క్రష్ అనే ట్యాగ్ గురించి మాట్లాడుతూ..”ఇటీవల కాలంలో కొంతమంది అభిమానులు నన్ను క్రష్ లాంటి పదాలతో పిలుస్తున్నారని కొంతమంది చెప్పారు. ఇలాంటివి వినడానికి చాలా బాగా, మధురంగా ఉంటాయి. అయితే వీటి గురించి తాను ఎక్కువగా ఆలోచించనని తెలిపారు. ఎందుకంటే ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికం మాత్రమే.. కాలక్రమేనా అవన్నీ మారుతూ ఉంటాయంటూ రుక్మిణి వసంత్ క్రష్ ట్యాగ్ పట్ల స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక హీరోలకు కూడా పలు ట్యాగ్స్ ఇచ్చినట్టు ఇటీవల కాలంలో హీరోయిన్లకు కూడా అభిమానులు ముద్దుగా పిలుస్తున్నారు. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న నటి రష్మిక మందన్నను కూడా అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ అంటూ పిలుస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో బిజీగా..
రుక్మిణి వసంత్ సైతం పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు తనని క్రష్ అంటూ పిలుస్తున్నారు. రుక్మిణి సినిమాల విషయానికి వస్తే కాంతార 1 సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఇప్పటికే ఈమె ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమె కల్కి 2 లో కూడా అవకాశం అందుకున్నారని దీపికా పదుకొనే స్థానంలో రుక్మిణి వసంత్ ను తీసుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు వార్తలు వినపడుతున్నాయి.
Also Read: Rishabh shetty: ఆ ఘర్షణ నుంచే కాంతార కథ పుట్టింది.. అసలు విషయం చెప్పిన రిషబ్!