Jayasudha Son Nihar Kapoor Misses Baahubali Offer: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. పాన్ ఇండియాగా వచ్చిన ఫస్ట్ చిత్రమిది. వరల్డ్ వైడ్ ఈ సినిమా రికార్డులు బ్రేకులు చేసింది. టాలీవుడ్ సినీ పరిశ్రమకు కీర్తి పెంచిన బాహుబలి తెలుగు పరిశ్రమకు ఓ మైలురాయిగా నిలిచింది. జక్కన్న భారీ బడ్జెట్ తో ఐదేళ్ల పాటు రూపొందించిన ఈ సనిమాలో ఎంతోమంది స్టార్స్ భాగమయ్యారు. ప్రభాస్ ఇండియన్ నెంబన్ వన్ స్థానంలో నిలబెట్టింది ఈ చిత్రం. రమ్యకృష్ణ కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేశారు. కానీ, శివగామి రాజమాత పాత్ర మాత్రం నటిగా ఆమె కీర్తిని మరింత పెంచింది. కట్టప్ప, బిజ్జలదేవగా.. సత్యరాజ్, నాజర్ లను ఈ పాత్రలు మరో స్థాయిలో నిలబెట్టాయి.
భల్లాలదేవకు రానా ఫస్ట్ ఛాయిస్ కాదా..
ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర భల్లాలదేవ.. రానా కెరీర్ లోనే ఇది ప్రత్యేకమైన పాత్ర. ఇప్పటీకి రానాను భల్లాలదేవ అనే పిలుచుకుంటారు ఫ్యాన్స్. ఈ సినిమాలో బాహుబలి తర్వాత అంతటి ప్రాధ్యాన్యత, స్క్రిన్ స్పెస్ ఉన్న ఈ పాత్ర కోసం ముందుగా రానాని అనుకోలేదు. అలనాటి హీరోయిన్, ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ ను ముందుగా ఈ పాత్ర కోసం తీసుకున్నారట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నిహార్ కపూర్ కు దీనిపై ప్రశ్న ఎదురైంది. బాహుబలి ఏదైనా పాత్ర వచ్చి మిస్ అయ్యారా? అని ప్రశ్నించారు.
అమ్మ వద్దని చెప్పింది..
దీనికి అతడు.. భల్లాలదేవ పాత్ర కోసం తనని అడిగారు అని చెప్పుకొచ్చారు. ‘రానా కంటే ముందు భల్లాలదేవ పాత్రకి నన్ను తీసుకున్నారు. మూడు వారాలు ఆ పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకున్నారు. ఓ రోజు ఈ రోల్ ని రానా చేస్తున్నారు. మీరు కాలకేయక పాత్ర చేస్తారా? అని అడిగారు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డ. దీంతో కాలకేయ పాత్రకి సంబంధించిన క్యారికేచర్ కూడా చూపిస్తూ మీ పాత్ర లుక్ ఇలా ఉంటుందని వివరించారు. దానికి ఎక్కువగా ప్రొస్థటిక్ మేకప్ చేశారు. ఆ తర్వాత లుక్ టెస్ట్ కూడా చేశారు. ఇందులో నా ఫేస్ మొత్తం కవర్ అయిపోయింది. నా బాడీ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని అమ్మ(నటి జయసుధ)కు చెప్పాను. ఇది నువ్వు లాంచ్ అవుతున్న చిత్రం. నీ డెబ్యూ మూవీలోనే ఫేస్ కూడా సరిగా కనిపించడం లదేు. బాడీ కూడా కవర్ అయిపోయింది. ఇది చేస్తే ఆడియన్స్ నిన్ను గుర్తించరని చెప్పింది. అమ్మ సూచన మేరకు నేను ఈ సినిమా చేయనని చెప్పేశాను. దీంతో కాలకేయ పాత్రకు ప్రభాకర్ ను తీసుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు.
స్క్రీన్ పై ఆ పాత్ర చాలా మారిపోయింది..
కానీ, స్క్రిన్ పై ఈ పాత్ర పూర్తిగా మారిపోయిందన్నాడు. క్యారీకేచర్ తో పోలిస్తే సినిమాల్లో కాలకేయ పాత్ర చాలా డిఫరెంట్ గా కనిపించింది. నేను ఊహించినట్టుగా లేదని చెప్పాడు. అయితే ఆ పాత్ర మిస్ అయినందుకు తానేమి నిరాశ చెందలేదన్నాడు. మొదటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు రాజమౌళి తనతో నేరుగా మాట్లాడేవారని, ఆ తర్వాత సరదాగా షూటింగ్ రమ్మని పిలిచేవారని చెప్పాడు. ఆయన పిలుపు మేరకు అప్పుడప్పుడు బాహుబలి షూటింగ్ సెట్స్ కి వెళ్లి వచ్చివాడినని నిహార్ తెలిపాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా స్టార్ నటి అయిన జయసుధ కొడుకు ఇలాంటి భారీ మూవీ ఆఫర్ వదులుకున్నాడని, బాహుబలి లాంటి సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఉంటే అతడి కెరీర్ ఎక్కడిగో దూసుకెళ్లేదని, మంచి ఆఫర్ మిస్ చేసుకు్నాడంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.