Actress Meena: సౌత్ సినీ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆగ్ర హీరోలందరి సినిమాలలో నటించి మెప్పించిన వారిలో సీనియర్ నటి మీనా(Meena) ఒకరు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరియర్ ప్రారంభించారు. ఇలా బాల నటిగా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి అనంతరం వారితోనే హీరోయిన్గా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ గారు, కమల్ హాసన్, మమ్ముట్టి, బాలకృష్ణ వంటి వారందరి సినిమాలలో కూడా ఈమె బాలనటిగా నటించి అనంతరం హీరోయిన్గా వారితోనే సినిమాలు చేసినట్టు గుర్తు చేసుకున్నారు.
ఇక నాగార్జున(Nagarjuna) సినిమాలో కూడా తనుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. నాగార్జున నటించిన సినిమాలలో గీతాంజలి(Geethanjali) సినిమా ఒకటి ఈ సినిమా ఎలాంటి ఆదరణ అందుకున్న మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో మీనాకు నటించే అవకాశం వచ్చిందని తాజాగా ఈమె బయట పెట్టారు. ఈ సినిమాలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉంటారు అందులో చిన్నమ్మాయి పాత్రలో ముందుగా నటించే అవకాశం తనకే వచ్చిందని, ఇక ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ కోసం కొలతలన్నీ కూడా తీసుకున్నారు. అదే సమయంలోనే తనకు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో అమ్మ ఒప్పుకోలేదని వెల్లడించారు.
ఇలా తనకున్న షూటింగ్ షెడ్యూల్ టైం లోనే ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో గీతాంజలి సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చిందని లేకపోతే నాగార్జున గారి సినిమాలో కూడా తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించేదాన్ని అంటూ మీనా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.. ఇలా చిన్నప్పటినుంచి వరుస సినిమాలలో తీరిక లేకుండా నటిస్తున్న ఈమె అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఒక్కో రోజు మూడు నాలుగు షిఫ్ట్ లలో కూడా తాను పనిచేశానని, కనీసం తినడానికి టైం కూడా ఉండేది కాదని తెలిపారు.
బాలనటిగా మీనా కుమార్తె నైనిక..
ఇకపోతే తన సినిమాలను చూసుకునే సమయం కూడా తనకు ఉండేది కాదని తెలిపారు. ఈమె నటించిన ముత్తు సినిమా ఇటీవల రీ రిలీజ్ సమయంలో మొత్తం సినిమాను థియేటర్లో మొదటిసారి చూసాను అంటూ ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇలా చిన్నతనం నుంచి నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నా మీనా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తిరిగి ఎంతో బిజీ అవుతున్నారు.ఇలా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్ది రోజులకే తన భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. తన భర్త మరణం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మీనా తిరిగి ఆ బాధ నుంచి బయటపడి యధావిధిగా వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈమె కుమార్తె నైనిక కూడా బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
Also Read: Big tv Kissik Talks: విష్ణుప్రియ పెళ్లిలో ఇన్ని ట్విస్టులా…అమ్మ కోరిక తీరకుండానే అంటూ!