BigTV English

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

Mowgli Release Date: చాయ్ బిస్కెట్ ఛానల్ లో కొన్ని వీడియోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రాజ్. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా థియేటర్లో విడుదల కాలేదు కానీ ఓటీటీ లో విడుదలైంది. కలర్ ఫోటో సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది. చాలామంది ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.


కలర్ ఫోటో సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ రాజ్ ఒక సినిమాకి కూడా డైరెక్షన్ చేయలేదు. మొత్తానికి సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా మొగ్లీ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. రిలీజ్ డేట్ ను ఒక క్రేజీ వీడియోతో అనౌన్స్ చేశారు.

క్రేజీ వీడియో 

కలర్ ఫోటో సినిమాలో బాల యేసు అనే పాత్రలో కనిపించాడు వైవా హర్ష. హర్ష ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ కమెడియన్ గా మారాడు. హర్ష డేట్స్ దొరకడం కూడా కొంతమందికి కష్టం అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే హర్ష కి మరియు సందీప్ రాజ్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.


అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లో హర్షను ఇన్వాల్వ్ చేశాడు. హర్ష కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. మొబైల్ చూసుకుంటున్న హర్ష దగ్గర సందీప్ రాజ్ మొగ్లీ టాపిక్ తీసుకొస్తాడు. వెంటనే నువ్వు కలర్ ఫోటో తీసినప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న రోషన్ ఈరోజు హీరో అయిపోయాడు. నువ్వు మాత్రం ఇంకా కలర్ ఫోటో అనుకుంటూ ఉంటున్నావ్ సినిమా తొందరగా రిలీజ్ చేయరా అంటూ చెప్పాడు హర్ష.

రిలీజ్ డేట్ 

మొత్తానికి ఈ వీడియోలో రిలీజ్ డేట్ గురించి డిస్కషన్ జరిగింది. డిస్కషన్ లో మొదట డిసెంబర్ 5న రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు. అయితే డిసెంబర్ 5న బాలకృష్ణ నటించిన అఖండ టు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మళ్లీ బాలకృష్ణతో కొట్టించుకుంటావా అని హర్ష అడగ్గానే డాకు మహారాజు సీన్ వీడియోలో ప్లే చేశారు.

ఆ తరువాత క్రిస్టమస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేద్దామని. దానిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మొత్తానికి రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల కాదు అని నటుడు బండి సరోజ్ సందీప్ తో బెట్ కట్టారు. ఇదే సంవత్సరం విడుదలవుతుంది అని సందీప్ రాజ్ కూడా లక్ష రూపాయలు బెట్ వేశారు.

Also Read: Telusu Kada Trailer : ఇబ్బందుల్లో పడ్డ తెలుసు కదా చిత్ర యూనిట్, చివరి నిమిషంలో ఇలా

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×